ప్రచురణార్థం
మహబూబాబాద్ జనవరి 27 .
మిర్చి రైతుల పంటకు అత్యధిక ధర పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోమిర్చి పంట కొనుగోళ్లపై సంబంధిత జిల్లా స్థాయీ లైన్ డిపార్ట్మెంట్లతో FPO/FPCs లు చేయుటకు సమన్వయమీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కురవి మండలంలో మిర్చి కొనుగోలు జరుగుతున్నందున అధికారులు ఎండు మిర్చి (తేజ) రకం కొనుగోలుకు డిమాండ్ ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సదరు కంపెనీ యాజమాన్యాల ద్వారా జిల్లా లోని ఎండు మిర్చి (తేజ) రకము కొనుగోలు చేయుటకురాష్ట్రస్థాయి CEO గారు కురవి మండలం లో వున్నా ప్లాంట్ లిపిడ్ ప్రైవేటు కంపెనీ వారితోఒప్పందం జరిగినదని ఇందులో ప్లాంట్ లిపిడ్ కంపెనీ వి ఎల్ పి సి కిసంబంధించిన ఇంచార్జ్ వ్యక్తులు కలిసి మిర్చి ఎండిన మిర్చి గ్రేడింగ్ తర్వాత రైతు కల్లమ్
దగ్గరకు వెళ్లి క్వాలిటీ ఆధారంగా గడచిన ఐదు రోజుల రేటు సరాసరి చూసుకొని ఆ రైతు కు
తెలియజేయాలన్నారు.
రైతులు ఒప్పుకున్న ఎడల వారికి కొనుగోలు పత్రము ఇస్తారని ఇచ్చిన తదుపరి 48 గంటలలో ఆ రైతు ఆ క్వాలిటి మిర్చిని వి.ఎల్.పి.సికి బ్యాగులల్లో తొక్కి తీసుకురావాలని తెలియజేయాలన్నారు. వి.ఎల్.పి.సి లో బ్యాగులను తూకం వేసినతదుపరి అతనికి సంబంధించిన మొత్తం బస్తాలు తూకం వేసి తదుపరి మొత్తం బ్యాగులుమొత్తము బరువును కంపెనీ వ్యక్తి వి ఎల్ పి సి లో ఉన్న వ్యక్తి రైతుముగ్గురు కలిసి ధ్రువీకరించాలన్నారు. వి ఎల్ పి సి కి ప్లాంట్ లిపిడ్ వారే 10 టన్నుల లారీ గాని 15 టన్నుల లారీ పంపిస్తారని కొనుగోలు చేసిన మిర్చి తీసుకుపోయే బాధ్యత వారిదని తెలపాలన్నారు. రైతుకు 2 నుంచి 4 రోజులలో Online ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ డిఆర్డిఓ సన్యాసయ్య ఉద్యానాధికారి సూర్యనారాయణ వ్యవసాయ అధికారి చత్రునాయక్ రవాణా శాఖ అధికారి రమేష్ రాథోడ్ డీపీ ఎం లు తదితరులు పాల్గొన్నారు .