రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు తెలిపారు.

గురువారం ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెం వ్యవసాయ క్లస్టర్ లో 22 లక్షలు, రాజుపేట గ్రామంలో 22 లక్షలతో నిర్మించిన రైతువేదికలు, పొగళ్లపల్లి గ్రామంలో 157.25 లక్షల వ్యయంతో నిర్మించిన 25 రెండు పడక గదుల ఇండ్లు, రాజాపురం, జగన్నాధపురం, నల్లముడి, గుట్టగూడెం గ్రామాల్లో 32. లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడుతూ రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా ఉన్నదని చెప్పారు. పంట పెట్టుబడికి రైతు అప్పు చేయకుండా రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వమే సంవత్సరానికి ఎకరాకు 10 వేల రూపాయలు చెల్లిస్తున్నదని చెప్పారు. ఏదేని కారణాల వల్ల మరణించిన రైతు కుటుంబ సభ్యులకు రైతుభీమా అమలు చేస్తూ రైతు కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి నిరుపేద విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ వ్యసాయానికి సంబంధించి రైతులు ఏ ఏ పంటలు సాగు చేయాలనే అంశంపై చర్చలు నిర్వహించడానికి రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. పంటల సాగుపై రైతులు, వ్యవసాయ అధికారులతో ముఖాముఖి నిర్వహించి ఆధునిక సాంకేతిక పద్ధతి ద్వారా అధిక దిగుబడి. వచ్చే పంటలు సాగు చేయు విధంగా రైతులకు అవగాహక కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రభుత్వం అన్ని వ్యవసాయ క్లస్టర్లుతో రైతువేదికలు నిర్మించినట్లు చెప్పారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందని, అటువంటి వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేసి రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చేపట్టిన చర్యలు చక్కటి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ లాభసాటి పంటలు సాగు ద్వారా రైతులు సంపన్నులు కావాలని తెలిపారు. పండుగ వాతావరణంలో రైతుల సమక్షంలో రైతువేదికలు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రైతులను సంఘటితం చేసి అధిక దిగుబడినిచ్చే పంటలసాగును చేపట్టేందుకు రైతులకు ఒక వేదిక అవసరమని గుర్తించిన ప్రభుత్వం జిల్లాలోని 67 వ్యవసాయ క్లస్టర్లులో రైతు వేదికలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి రైతు వేదికకు ప్రభుత్వం 22 లక్షల రూపాయలు కేటాయించిందని, గ్రామ పంచాయతీలు, దాతలు సహాకారంతో రైతు వేదికలను సుందరంగా నిర్మించామని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. రైతాంగం, వ్యవసాయ అధికారులు సంఘటితంగా అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహణ ద్వారానే రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించడంతో పాటు ఉత్తమ దిగుబడులు సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గం పామాయిల్ పంటల సాగుకు పేరెన్నిక కన్నదని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పామాయిల్ పంట సాగు పెద్ద ఎత్తున చేపట్టారని, అదేవిధంగా ముల్కలపల్లి మండలంలో కూడా రైతులు పెద్ద ఎత్తున పామాయిల్ సాగు చేపట్టి అధిక లాభాలు గడించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ అధికారి అభిమన్యుడు, పిఆర్ ఈఈ సుధాకర్, జడ్పీ సిఈఓ సమన్వయ సమితి సభ్యులు, ముల్కలపల్లి, దమ్మపేట జడ్పీటిసిలు, యంపిపిలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post