రైతు దినోత్సవం రోజున రైతు వేధికలల్లో అన్ని ఏర్పాట్లను చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

రైతు దినోత్సవం రోజున రైతు వేధికలల్లో అన్ని ఏర్పాట్లను చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, జూన్.1

రైతు దినోత్సవం రోజున రైతు వేధికలల్లో అన్ని ఏర్పాట్లను చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 3 వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ మండలం లోని జంగిలిగొండ, కురవి మండలం నేరేడ, బయ్యారం మండలంలోని రైతు వేదికలలో జరుగు కార్యక్రమాల ఏర్పాట్లను జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదికలలో ప్రతి రైతు వేదికను తోరణాలతో అలంకరించి కొబ్బరి ఆకులతో అలంకరించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా అన్ని రైతు వేదికల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రైతు వేదికలో ఏర్పాట్లను ఏఈఓ లను అడిగి తెలుసుకున్నారు. ఆ రోజున భోజనాల ఏర్పాట్లు చేసే స్థలాలను పరిశీలించి అధికారులకు సలహా సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ టీసీ లు, సర్పంచులు, వ్యవసాయ అధికారి చత్రునాయక్, ఏడీ ఏ లు, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శి లు పాల్గొన్నారు.

Share This Post