రైతు ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలను పునః ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వైరా కృషివిజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైతు శిక్షణా కేంద్రం పనుల పురోగతిని పరిశీలించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 03 ఖమ్మం –

రైతు ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలను పునః ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వైరా కృషివిజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైతు శిక్షణా కేంద్రం పనుల పురోగతిని పరిశీలించారు. రైతు శిక్షణ కేంద్రంలో అన్ని వసతులను సమకూర్చి రైతులకు శిక్షణను త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్నిచర్, పి.ఏ. సిస్టం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితర వసతులను సత్వరమే సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. ముగింపు పనులను త్వరగా పూర్తిచేసి  రైతు శిక్షణా కేంద్రం నూతన భవనాన్ని రైతులకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణను కలెక్టర్ పరిశీలించారు. ఆవరణలో పరిశుభ్రత పనులను సత్వరమే చేపట్టాలని మున్సిపల్ కమీషనర్ను కలెక్టర్ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాన్ని తొలగించాలన్నారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా రైతులకు నేరుగా ప్రత్యక్ష శిక్షణా తరగతులు జరగలేదని, ప్రత్యేక్ష శిక్షణా తరగతులను మళ్ళీ పున: ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. వైవిధ్యమైన పంటలకు ఖమ్మం జిల్లా పరిస్థితులు అనుకూలిస్తాయని రైతులు కేవలం ఒకే పంటవైపు మొగ్గుచూపకుండా ప్రత్యామ్నాయ పంటసాగు చేసేవిధంగా వ్యవసాయానుబంధ రంగాలలో నూతన పద్ధతులు, మెళకువలను రైతులకు అందించాలని కలెక్టర్ శాస్త్రవేత్తలకు సూచించారు. కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డా॥ హేమంత్ కుమార్ కృషి విజ్ఞానకేంద్రం ద్వారా చేపడ్తున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో వరీ విస్థీర్ణం ఎక్కువగా ఉంటుందని 2.56 లక్షల ఎకరాలలో రబీసాగు అవుతుందని, మన జిల్లాలో 25 వేల ఎకరాలలో వరి వెదజల్లే ప్రక్రియ ద్వారా వరిసాగు జరుగుతుందని ఇట్టి పద్ధతిని రాష్ట్రంలో మన జిల్లాలోనే అధికంగా రైతులు అవలంభిస్తున్నారని వివరించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ప్రతి వారం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రైతు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. వరి, మిర్చి, పత్తి పంటలపై జిల్లా రైతులకు కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆత్మా ద్వారా క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి అవగాహన కల్పించడం జరుగుచున్నదని వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు నాలుగు వందల నుండి ఐదు వందల క్వింటాళ్ళ వరి విత్తనాలు అందిస్తున్నట్లు శాస్త్రవేత్త హేమత్ కుమార్ వివరించారు.

జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీమతి విజయనిర్మల, ఉద్యానవన శాఖాధికారి శ్రీమతి అనసూయ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు జట్పీ.టి.సి కె. కనకదుర్గ, మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, మున్సిపల్ కమీషనర్ వెంకటస్వామి, తహశీల్దారు హెచ్ రంగ, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post