రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది..ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది..ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

నలుగురికి అన్నం పెట్టె రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హవేళీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి లో పి.ఏ.సి.ఎస్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వ్యవసాయం దండుగ అనే వారని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బందు, ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇస్తు సాగు నీరు అందిస్తుండడం వల్ల పుష్కలంగా పంట దిగుబడి వస్తున్నదని అన్నారు. గత యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకి ఇబ్బందులు గురిచేసిన రాష్ట్ర ప్రభుత్వం కొని గోదాములలో భద్రపరచిందని అన్నారు. రైతుల కళ్ళల్లో సంతోషం, వారి ముఖంలో చిరునవ్వు చూడాలని, రైతులకు పిల్లనిస్తామనే స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సంక్షేమానికి అవిరళ కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకున్నాం, చెక్ డ్యామ్ లు నిర్మించుకున్నాం. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులు నింపుకుంటున్నాం. వర్షాలు కూడా సమృద్ధిగా పడడం వల్ల భూగర్భ జల మట్టం కూడా పెరిగిందని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
ఈ ఖరీఫ్ లో మెదక్ నియోజక వర్గంలో రెండు లక్షల 14 వేల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందని అన్నారు. కాగా జిల్లాలో ఈ వానాకాలం లో రైతుల అవసరాలు, విత్తన అవసరాల నిమిత్తం పోను 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు వచ్చే అవకాశమున్నదని, అందుకనుగుణంగా జిల్లా యంత్రాంగం పి .ఏ.సి.ఎస్., ఐ.కె.పి , మార్కెటింగ్, రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో 386 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ధాన్యం సేకరణకు కోటి 50 లక్షల గొనె సంచులు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వానికి ముందే ఇండెంట్ సమర్పించామని ఈ సారి గొనె సంచుల కొరత ఉండదని అన్నారు. ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయనున్నాం కాబట్టి రైతులు దళారీల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించాలని సూచించారు. 17 శాతం తేమ మించకుండా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలని, సంయమనం పాటించాలని, సకాలంలో డబ్బులు వేస్తామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపాల్, వ్యవసాయాధికారులు, తహశీల్ధార్, మండల అభివుద్ది అధికారి, ఏంపిపి శేరి నారాయణ రెడ్డి, జెడ్పీ.టి.సి. సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post