రైతు మేలు కొసం రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, సాగు నీరు, నకిలీ విత్తనాల నిర్ములనతో పాటు రైతు వేదికలతో పాటు ఎన్నో ఉపయోగకరమైన పనులను చేపట్టిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

రైతు మేలు కొసం రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, సాగు నీరు, నకిలీ విత్తనాల నిర్ములనతో పాటు రైతు వేదికలతో పాటు ఎన్నో ఉపయోగకరమైన పనులను చేపట్టిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగు మరియు వరి ధాన్యం కొనుగోలుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ, గతంలో నాలుగు ఐదు మండలాలకు ఒక వ్యవసాయ అధికారి ఉండేవారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక అధికారిని నియమించి రైతులకు పంటలపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సహకారం వల్ల రైతులకు ఒక నమ్మకం కల్గిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఏ సమావేశంలో నైనా రైతుల గురించి తప్పక మాట్లాడుతారని, రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లభించాలని, వారు నష్టపోకూడదని ఆకాంక్షిస్తూ ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర పత్తికి, తాండూర్ కందికి చాలా ప్రముఖ్యత ఉందన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లభించే పంటలపై క్షేత్ర స్థాయిలో శాస్త్రవేత్తలు సలహాలు అందించాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి కొనుగోలు చేయమని స్పష్టంగా చెప్పినందున రైతులు కూరగాయాలు పండిస్తే మంచి లాభాలు వస్తాయని సూచించారు. రైతులు నష్టపోకుండా రైతు వేదికల ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంట మార్పిడిపై ఉద్యానవన శాఖ అధికారులు కూడా రైతులకు సలహాలు అందించాలని సూచించారు.

వానాకాలం వరి పంట సేకరణలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని, సకాలంలో ధాన్యం వచ్చే విధంగా చూడాలన్నారు.పక్క రాష్ట్రాల నుండి వరి ధాన్యం రాకుండా పర్యవేక్షించాలన్నారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలుకు వీలు పడదని స్పష్టం చేసిన విషయం రైతులకు తెలియపర్చాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 124 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 641 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించడం జరిగిందని, పంటలు ఇప్పుడిప్పుడే కోతకు వచ్చాయని, ఈసారి 2,07,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంచనా వేయడం జరిగిందన్నారు. రైతులకు ఏలాంటి ఇబ్బందులు జరుగకుండ లోడింగ్, అన్ -లోడింగ్ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 62 లక్షల గన్నీ బ్యాగులు, 1200 టార్పొలిన్, తూకం పరికరాలు అందుబాటోలో ఉన్నాయని తెలిపారు.ప్రతి సెంటర్కు ఒక స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.మరో 15 రోజులలో ధాన్యం సేకరణ మొదలవుతుందని తెలియజేసినారు.రావులపల్లి, కోట్లపూర్ వద్ద చెకపోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.వరి ధాన్యం సేకరణలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ / పరిగి శాసనసభ్యులు మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ మోహన్ రెడ్డి, డీసీఎంస్ చైర్మన్ కృష్ణా రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, రైతు సమన్వయ కమిటీ కో -ఆర్డినేటర్లు,మండలవ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post