రైతు వేదిక, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు : పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

పత్రికా ప్రకటన
18 .9 .2021
వనపర్తి

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసి అభివృద్ధి చేస్తున్నదని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు అన్నారు.

శనివారం వనపర్తి జిల్లా పానుగల్ మండలం రేమద్దుల గ్రామం లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ల తో కలిసి రైతు వేదిక ప్రారంభించి, రేమద్దుల నుండి కాసిమ్ నగర్ వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నదని ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రేమద్దుల కాశీ నగర్ రోడ్డు పనులకు ప్రారంభించడం జరిగిందని అన్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ పాత్ర ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ ను ఎంపీ ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదికలు గ్రామాలలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నూతన సాంకేతిక వంగడాల గురించి భూసార పరీక్షలు ఇతర సమస్యలపై రైతులు వ్యవసాయ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని పంటల అభివృద్ధికి రైతు వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల, మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు…..

……………………జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post