రైతు శ్రేయస్సుయే ప్రభుత్వ లక్ష్యం రైతు నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తాం:: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీాణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

దేశంలో ఎక్కడ లేని విధంగా వరి ధాన్యంకు మద్దతు ధర కల్పిస్తూ, రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

పాలకుర్తిలో రిజర్వాయర్ నిర్మించి మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్ధం
జనగామ నవంబరర్ : 06
రైతు శ్రేయస్సుయే ప్రభుత్వ లక్ష్యమని రైతు నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీాణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
శనివారం పాలకుర్తి మండల కేంద్రం, దర్దేపల్లి గ్రామంలో జిల్లా పౌర సరఫరాల శాఖ, ఐకెపి శ్రీ చైతన్య గ్రామైఖ్య సంఘం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరించినందున
రైతుకు నష్టం కలగకుండా
తెలంగాణ ప్రభుత్వం
మద్దతు ధర కల్పంచి దాన్యం కోనుగోలు చేయుటకు ముందుకు వచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రకం కు రూ.1960. సాధారణ రకం రూ.1940 /- చెల్లించి కొనుగోలు చేసి రైతుకు మేలుచేస్తుందని టోకెన్ల పద్దతిలో ధాన్యం కొనుగోలు చేస్తుదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులతోనే తెలంగాణ పుష్కలంగా నీరు అంది పంటలు సమృద్ధిగా పండు తున్నాయని రైతులకు రైతు బందు, రైతు భీమా, రైతుల కోసం రైతు వేదికలు, కల్లాలు కట్టించి సాగునీరు,24 గంటల పాటు ఉచిత నాణ్యమైన కోతలు లెని విద్యుత్ అందిస్తున్నామని అన్నారు.
వచ్చే యాసంగిలో వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు లేపాక్షి పల్లి (విత్తనం), ఫామ్ ఆయిల్, ఇతర లాభదాయక పంటలు సాగు చేయుటకు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
పాలకుర్తిలో రిజర్వాయార్ నిర్మించి మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో 180 కేంద్రాలు రెండు సంఘాల ద్వారా (ఐకెపి) మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చేంత వరకు ధాన్యాన్ని ఆరబెట్టి కేంద్రానికి తీసుకురావాలని
కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కుడా పూర్తి పారదర్శకంగా త్వరగా ఆన్ లైన్ ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్ రావు,అబ్దుల్ హమీద్, ఆర్డిఓ క్రిష్ణావేణి, డిఆర్డిఓ జి.రాంరెడ్డి,డిఎస్ఓ ఎం.రోజారాణి, డిఎఓ టి.రాధిక, డిసిఓ కిరణ్, డిఏం.సంధ్యరాణీ,ఎఫ్ఎస్సీ.చైర్మన్. బొబ్బల అశోక్ రెడ్డి,స్థానిక సర్పంచ్. యాకంతరావు, ఎంపిపి నాగిరెడ్డి, జెడ్పీటిసి పి.శ్రీనివాసరావు, జెడ్పీ
కో ఆప్షన్ మెంబర్ మధర్, మార్కెట్ కమిటీ చైర్మన్.రాంబాబు. ఎడవెల్లి పురుషోత్తం, శ్రీమతి పుష్ప, వేణు, ఎండి సర్వర్ ఖాన్, డిఆర్డిఎ ఏపిడి నురోద్దిన్, తహశీల్దార్,విజయ్ భాస్కర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post