రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేరాలి. యాసంగిలో ఆరుతడి పంటలు పండించే లా రైతులకు అవగాహన కల్పించాలి. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

జిల్లాలో ఆరుతడి పంటలు పండిచేలా రైతులకు ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన అదికారులు ప్రత్యేక అవగాహాన కల్పిస్తూ కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి సూచించారు.  సోమవారం స్థానిక జెడ్.పి. సమావేశ మందిరంలో జెడ్.పి. చైర్ పర్సన్ గుజ్జ దిపికా యుగంధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి యం.పి. బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి   మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 వానాకాలం వరి పంట  398218 ఎకరాలలో కాగా 2021 లో 584537 పంట సాగు చేశామని అలాగే యసం  గిలో వరి పంట 223478 ఎకరాలలో సాగు చేయగా 2020లో 438574 ఎకరాలలో సాగు చేశామని తెలిపారు. యసంగీలో పండించే వరి  కేంద్రం ఎఫ్.సి. ఐ ద్వారా కొనుగోలు చేసే పరిస్తితి లేదని రైతులు పంట పండి చీ ఆర్థికంగా నష్ట పోకుండా ముందస్తుగా వాస్తవ పరిస్తితి వివరిస్తున్నా మని అన్నారు. మార్కెట్ లో ప్రత్యామ్నాయ పంటలకు మంచి డిమాండ్ ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన అధికారుల ద్వారా జిల్లాలో 82 క్లస్టర్ వారీగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆరుతడి పంటలు పండించే విధంగా  కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.  జిల్లాలో రెండు పంటలకు పుష్కలంగా సాగు నీరు అందడం తో    గత మూడు సంవత్సరాలుగా  వరి పంట గణనీయంగా పెరిగిందని వివరించారు. జిల్లాలో ఈ వానాకాలం పంట ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు  ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేవాలని దీపావళి తర్వాత జిల్లాలో అనుబంధ శాఖల ద్వారా 333 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇంకా కేంద్రాలు కావాలంటే ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. గత కరోనా సమయంలో తెలంగాణలో పండించిన ప్రతి గింజను  రైతు కళ్ళల వద్దకే వెళ్లి కొనుగోలు చేసిందని, ప్రభుత్వం రైతు ప్రభుత్వమని పేర్కోన్నారు. సమావేశంలో బాగంగా ముందుగా  వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పలు పడకాలను  జిల్లా అధికారులు వివరించారు. ముందుగా డి.ఆర్.డి. ఏ ద్వారా చేపట్టిన పలు పథకాలను వివరిస్తూ జిల్లా స్త్రీనిధి  ద్వారా అందించిన రునాలలో సూర్యాపేట జిల్లా ముందంజలో ఉందని అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వివిధ రకాల పెన్షన్లు ఆసరా 1,26,202 మందికి అందిస్తున్నామని అన్నారు. ఇంకా 26, 704 ఆసరా పెన్షన్ల ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ లాగిన్ కి పంపించడం జరిగిందని అన్నారు. వికలాంగుల కొరకు నెలలో 3 నుండి 4 సార్లు సదరం క్యాంపులు నిర్వహిస్తూ నమని , EGS ద్వారా జిల్లాలో 2, 63, 163 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేశామని అన్నారు.  అలాగే మిషన్ భగీరథ ఇంట్రా ద్వారా 22 మండలాలకు గాను  రూ. 349.93కోట్ల తో 829 ట్యాంకులు పూర్తి చేసి 2190.26 కి.మీ పూర్తి చేసి ప్రతి అవసానీకీ నీరు  అందిస్తున్నామని అన్నారు. నీటి పారుదల శాఖ ద్వారా జిల్లాలో 5,82,464 ఆయకట్టు ఎక్ఖరాలలో కాళేశ్వరం, శ్రీరామ్ సాగర్ ద్వారా రెండు పంటలకు సమృద్దిగా సాగు నీరు అందిస్తున్నామని అన్నారు. జల్లాలో గ్రామ పంచాయతీ ల ద్వారా గ్రామాలలో పారిశుధ్య పనులు, ఏర్పాటు చేసిన పల్లే ప్రకృతి వనాలు, హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణ అలాగే పన్నుల వసూళ్లు చేపట్టడం జరుగుతుందనీ ఇప్పటివరకు రూ. 234.15 కోట్లు వివిధ పనుల కింద నిధులు విడుదల చేశామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో కెసిఆర్ కిట్స్ ఇప్పటి వరకు 15581 మందీకీ రు. 4, 51,883,000  అలాగే 2642 మందికి కెసిఆర్ కిట్స్ అందించడం జరిగిందని అన్నారు.
   అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్షనేషన్ 80 శాతం పూర్తి చేశామని ఇప్పటి వరకు 6 లక్షల 70 వేల మందికి వ్యాక్సిన్ అందించామని అలాగే ఇంకా లక్షా 30 వేల మందికి వ్యాక్సిన్ వేయవలసి ఉన్నదని ప్రజా ప్రతినిధుల సహకారం తప్పని సరియని తెలుపుతూ ప్రజలు మెడికల్ టీమ్ కు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రజా ప్రతినిదులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు  పలు అంశాలకు సమాధానాలు చేపట్టడం  జరిగింది. అనంతరం జెడ్.పీ. ఆవరణలో సమావేశ మందిరం నిర్మాణానికి కావాల్సిన స్థల పరిశీలన జిల్లా కలెక్టర్ తో కలసి మంత్రి, యం.పీ.  పరిశీలించారు
  ఈ సమావేశంలో తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్,  జెడ్.పీ. వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సి. ఈ. ఓ  సురేష్, ఏ.డి. ఏ రామారావు నాయక్, ఉద్యాన అధికారి శ్రీధర్,  పి.డి.లు, కిరణ్ కుమార్, జ్యోతి పద్మ, zptc లు, ఎంపీపీ లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post