రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

  • రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
  • జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ
  • జిల్లాలో 357 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
  • కొనుగోలు కేంద్రాలకు 3,39,127 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా.
  • గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్ కు 1960/-
  • సాధారణ రకానికి క్వింటాలుకు 1940/-
  • జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000000

     రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

     మంగళవారం జమ్మికుంట మార్కెట్ యార్డ్ లో యాసంగి వరి ధాన్యం  కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ రైతుల  శ్రేయస్సు , సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రైతు బీమా, రైతు బంధు,24 గంటల ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మాలని తెలిపారు

     జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ ఈ యాసంగి లో వరి కొనుగోలు కేంద్రాలకు  3లక్షల 39 వేల 127 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందని అన్నారు. దీనికోసం జిల్లాలో 357 వరి ధాన్యం  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  జిల్లాలో ఇప్పటికే 85 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1250 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాల్ కు 1960/-, సాధారణ రకం ధాన్యం క్వింటాలుకు1940/- ధర నిర్ణయించడం జరిగింది అన్నారు. ధాన్యం లో తేమ 17శాతం వరకు ఉండాలని అన్నారు.13 లక్షల 18వేల 476 గన్ని సంచులను కొనుగోలు కేంద్రాలకు ఇవ్వడం జరిగిందని,10 లక్షల19వేల 027గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, కలకత్తా నుంచి నాలుగు లక్షల గన్నీ సంచులు రానున్నాయని కలెక్టర్ తెలిపారు.

     కలెక్టర్ అనంతరం పట్టణంలోని పాత రైతు బజార్, దళిత బంధు లబ్ధిదారులు నెలకొల్పిన యూనిట్లను పరిశీలించారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్, జమ్మికుంట మున్సిపల్ చైర్ పర్సన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాల కిషన్ రావు, జెడ్ పి టి సి శ్రీ రామ్ శ్యామ్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ టంగుటూరు రాజ్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, తహసీల్దార్ రాజు, టిఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post