రైల్వే అండర్ బ్రిడ్జ్ రోడ్డు లెవలింగ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

రైల్వే అండర్ బ్రిడ్జ్ రోడ్డు లెవలింగ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-16:

సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పట్టణంలో నిర్వహిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు లెవెలింగ్ పనులను పరిశీలించారు,

రోడ్డుపై నీళ్లు నిలబడి ఉండడం వలన, పనులు పూర్తి దశలో కానందున, రెండువైపులా రోడ్డు మరమ్మతు ఒకేసారి చేస్తుండడంతో నడవడానికి, వాహనాలు వెళ్ళుటకు ఇబ్బంది ఏర్పడుతున్నదని, ముఖ్యమైన ప్రాంతం కాబట్టి ఒకవైపు మార్గాన్ని పూర్తిగా లెవలింగ్ పనులు చేసిన తర్వాత మరో మార్గం వైపు లెవలింగ్ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్డు పై నీళ్ళు నిలబడడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, డ్రైనేజీ పనులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పనులు ఎక్కువ శాతం రాత్రి వేళలో పూర్తి చేసేటట్లుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు, విద్యుత్ స్తంభాలు మార్చుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, రోడ్లు భవనాల శాఖ ఇ.ఈ. – తానేశ్వర్, డి.ఈ.- రాజేందర్, కాంట్రాక్టర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post