రైస్ మిల్లర్లకు అలాట్ చేసిన ధాన్యం దిగుబడి చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

రైస్ మిల్లర్లకు అలాట్ చేసిన ధాన్యం దిగుబడి చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

*రైస్ మిల్లర్లకు అలాట్ చేసిన ధాన్యం దిగుబడి చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ*

**రైతులకు ఇబ్బందులు కల్గిస్తే కఠిన చర్యలు*

**రైస్ మిల్లులకు గోడౌన్ స్థలం లేకపోతే ఇంటర్మిడియట్ గోడౌన్ లలో స్టోర్ చేసుకోవాలి*

**సుల్తానాబాద్ లో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
—————————————————
సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా, మే -31:
————————————————–
రైస్ మిల్లర్లకు అలాట్ చేసిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు.

బుధవారం సుల్తానాబాద్ మండలంలోని పూసాల గ్రామం సమీపంలో గల రైస్ మిల్లులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సుల్తానాబాద్ మండలంలోని మోహన్ కృష్ణా రైస్ మిల్, భవాని శంకర్ రైస్ మిల్, లక్ష్మీనారాయణ రైస్ మిల్, వరలక్ష్మి రైస్ మిల్, హరి శంకర్ రైస్ మిల్, భవాని ఎంఆర్ రైస్ మిల్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ , ధాన్యం సకాలంలో దించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు అలాట్ చేసిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకోవాలని, రైస్ మిల్లర్లకు గూడెంలో స్థలం కొరత సమస్య ఉంటే తాత్కాలికంగా ఇంటర్మీడియట్ గోడౌన్లలో స్థలం కల్పిస్తామని, వారికి కేటాయించిన ధాన్యాన్ని మాత్రం తప్పనిసరిగా దించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తోట వెంకటేష్, సంభందిత అధికారులు, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు
——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది

Share This Post