రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్న సి.ఎం.ఆర్ రైస్ డెలివరీలను త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మిల్లర్లకు సూచించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 30 ఖమ్మం:

రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్న సి.ఎం.ఆర్ రైస్ డెలివరీలను త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మిల్లర్లకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో యాసంగి పంటసీజన్ రైస్ మిల్లింగ్ డెలివరీల పురోగతిపై రైస్ మిల్లర్ల బాధ్యులతో, పౌర సరఫరాల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గల ఎనిమిది బాయిల్డ్ రైస్ మిల్లుల నుండి ఇప్పటికి కేవలం 45 శాతం మాత్రమే డెలివరీ జరిగినదని, 44,919 మెట్రిక్ టన్నులకు గాను 20,436 మెట్రిక్ టన్నులు మాత్రమే డెలివరీ చేసారని, అదేవిధంగా 36 రా రైస్ మిల్లుల నుండి 77 శాతం డెలివరీ జరిగిందని 30,154 మెట్రిక్ టన్నులకు గాను 23,352 మెట్రిక్ టన్నుల డెలివరీ జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. దీనితో పాటు ఎఫ్.సి.ఐ గోదాములలో ఖమ్మం జిల్లా మిల్లులకు ఎక్కువ దిగుమతి స్థలాన్ని కేటాయించాలని ఎఫ్.సి.ఐ మేనేజరు కు కలెక్టర్ సూచించారు. రైస్ మిల్లర్ల వద్ద ఇంకనూ పెండింగ్లో గల సి.ఎం.ఆర్ డెలవరీలను నెలరోజులలోపు పూర్తి చేసేలా ప్రణాళిక బద్దంగా సత్వర చర్యలు తీసుకోవాలని మిల్లర్ల బాధ్యులకు కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ ఎన్.మధుసూధన్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ జిల్లా మేనేజర్ సోములు, ఎఫ్.సి.ఐ డివిజనల్ మేనేజర్ రంగప్రసాద్, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ మేనేజర్ బి.సుందర్లాల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష్య కార్యదర్శులు బొమ్మా రాజేశ్వరరావు, నగేష్, జిల్లాలోని రైస్ మిల్లర్ల యజమానులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post