*రైస్ మిల్లులను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్*

*రైస్ మిల్లులను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్*

*రైస్ మిల్లులను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్*

రైస్ మిల్లర్లు ధాన్యం ఖాళీ చేసిన గన్నీ బ్యాగులకు వెంటనే సివిల్ సప్లయ్స్ అధికారులకు అందజేయాలి.

—————————–
సిరిసిల్ల 26, ఏప్రిల్ 2022:
——————————
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీలైనంత ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకుని లారీల నుంచి ధాన్యాన్ని సాధ్యమైనంత తొందరంగా దింపేందుకు ఏర్పాట్లు తీసుకోవాలని రైస్ మిల్లర్లను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో వేములవాడ గ్రామీణ మండలం మర్రిపల్లి గ్రామంలోని మారుతి, మహా లక్ష్మీ, మణికంఠ రైస్ మిల్లులను మంగళవారం అదనపు కలెక్టర్ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీ హరి కృష్ణ లతో కలిసి తనిఖీ చేశారు.

రైస్ మిల్లులలో పలు రికార్డులను పరిశీలించారు.
ఏయే మిల్లుల్లో ఎంత ధాన్యం నిలువ ఉంది.
సీఎంఆర్ రికార్డులను సరిగా నిర్వహిస్తున్నారా? ఎంత ధాన్యం ఇప్పటి వరకు మిల్లింగ్ అయ్యింది. మిల్లింగ్ వేగంగా చేస్తున్నారా లేదా… స్టోరేజ్ స్పేస్ ఎంత ఉంది తదితర అంశాలను అదనపు కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

జిల్లాలో 1,18,893ఎకరాల్లో వరిసాగయ్యిందని, 2,97,232 మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉందని, వచ్చే ధాన్యం మొత్తం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ A రకం రూ. 1960 , సాధారణ రకం రూ.1940 కు ధాన్యం ప్రభుత్వం కొంటుందన్నారు.
పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. 

కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ను రైస్ మిల్లర్ లు వెంటనే ధాన్యం అన్ లోడింగ్ చేసుకోవాలని అన్నారు.

రైస్ మిల్లర్లు ధాన్యం ఖాళీ చేసిన గన్నీ బ్యాగులకు వెంటనే సివిల్ సప్లయ్స్ కు అందజేయాలని సూచించారు.

మిల్లింగ్ ను వేగిరం చేసి
సీఎంఆర్‌ లక్ష్యాన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి FCI కి డెలివరీ చేయాలన్నారు. తద్వారా స్టోరేజ్ కెపాసిటీ పెరగడంతో పాటు ఖాళీ అయిన గన్ని బ్యాగులు తిరిగి వినియోగించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.

——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post