*రైస్ మిల్లులను నోడల్ అధికారులు పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు నివేదిక అందించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*రైస్ మిల్లులను నోడల్ అధికారులు పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు నివేదిక అందించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-3*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26: జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించిన తర్వాత క్షేత్ర స్థాయిలో నోడల్ అధికారులు వాటిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పౌర సరఫరాలు, రవాణా శాఖ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 41 వీఆర్ఓ లకు జిల్లాలో ఉన్న రైస్ మిల్లులను పర్యవేక్షించడానికి నోడల్ అధికారులుగా బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు. వీరు ధాన్యం మిల్లులకు దిగుమతి చేసిన వివరాలు, తదితర వాటిని ఎప్పటికప్పుడు నివేదికలు జిల్లా యంత్రాంగానికి అందించాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తెలపాలని తెలిపారు. ట్రక్ షీట్ ఆన్లైన్ జనరేషన్, రైతులకు పేమెంట్ చెల్లింపుపై దృష్టి సారించాలన్నారు. ఎన్ని వాహనాలు మిల్లుకు వస్తున్నాయి, కూలీలు అందుబాటులో ఉన్నారా లేరా అనే విషయాన్ని తెలపాలని అన్నారు. సమన్వయంతో ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీటీఓ కొండల్ రావు, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post