రైస్ మిల్లు యజమానులు యాసంగి ధాన్యాన్ని సామర్థ్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేసే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లుల వారిగా మిల్లింగ్ చేసిన వివరాలపై సమీక్ష చేపట్టారు. రైస్ మిల్లుల వారీగా మిల్లింగ్ ముమ్మరంగా చేపట్టాలని కోరారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, ఇంచార్జ్ జిల్లా సివిల్ సప్లై అధికారి రాజశేఖర్, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. —————— జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post