రోగులకు అందిస్తున్న సేవలు, చికిత్సల వివరాలు తెలిపే పౌర సేవా పట్టికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి …. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

రోగులకు అందిస్తున్న సేవలు, చికిత్సల వివరాలు తెలిపే పౌర సేవా పట్టికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి …. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్టు -14:

శనివారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.  ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు.  రోగి మొదట ఆసుపత్రిలో వచ్చిన తర్వాత ఓ.పి. విభాగం నుండి చికిత్స తీసుకునే ప్రక్రియను పలు విభాగాలకు వెళ్లి రోగులకు సేవలు ఎలా అందుతున్నాయో పరిశీలించి రోగులతో మాట్లాడారు.  ఓ.పి. లైన్ దగ్గర, దగ్గర ఉండడంతో భౌతిక దూరం పాటించాలని సూచించారు.  

టెస్టులు చేయించిన సందర్భంలో వాటి యొక్క ఫలితం ఎన్ని రోజులకు ఇస్తున్నారు అడిగి తెలుసుకున్నారు.  టెస్టులకు సంబంధించిన వివరాలు తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అంతేకాకుండా రోగి ఆసుపత్రిలోకి వచ్చిన తదుపరి ఏ విభాగానికి ఎటు వెళ్ళాలో సూచించే సూచిక బోర్డులు ఏర్పాటు చేసి రిపోర్టు చేయాలని తెలిపారు.
 

గర్భాశయ, లేబర్ రూం, స్టోర్ రూం, అబ్జర్వేషన్ రూం, గర్భిణీ సహాయక కేంద్రాన్ని, వెయిటింగ్ రూం, ఓ.పి. హెల్ప్ డెస్క్,శిశు సంజీవని ప్రత్యేక నవజాత శిశు చికిత్సా కేంద్రం విభాగాలకు వెళ్లి పరిశీలించారు.  ఈ సందర్భంగా చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడుతూ సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.  ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సంబంధికుల కోసం శుద్ధపరిచిన నీటిని సరఫరా చేసే ఆర్.ఓ. ప్లాంట్ మరమ్మత్తులో ఉండడం గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే మరమ్మత్తులు చేసి వారం లోగా వాడకంలోకి తీసుకరావాలని తెలిపారు.  కె.సి.ఆర్. కిట్లు భద్రపరిచిన స్టోర్ రూంను పరిశీలిస్తూ, ప్రసవాలు అనంతరం అందించిన వివరాలను తెలుసుకున్నారు.

కార్యక్రమంలో  ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ రాములు,  టి.ఎస్. ఎం. ఎస్. ఐ. డి. సి.-డి. ఇ. శ్రీనివాస్, వివిధ విభాగాల డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post