రోగులకు మెరుగైన సేవలు అందించాలి, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ # స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ # ఆసుపత్రి లో సుమారు 4 గంటలు పాటు వార్డులు పరిశీలన

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ డాక్టర్ లు,వైద్య సిబ్బందిని ఆదేశించారు.
శుక్ర వారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులలో సుమారు 4 గంటలు పాటు కలియ తిరిగి ఆసుపత్రి లో మౌలిక వసతులు రోగులకు అందుతున్న,వైద్య సేవలు పరిశీలించి సూచనలు చేశారు.
తొలుత కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital), మాతా శిశు ఆరోగ్య కేంద్రములను (Mother and Child Health Center) పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సు ఎంతమంది పని చేస్తున్నారని, వారి విధుల గురించి అడిగి జిల్లా కలెక్టర్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మిత్ర కౌంటర్ వద్ద రిజిష్టరులో ఎన్ని కేసులు నమోదు చేశారని స్వయంగా పరిశీలించారు. సిటీ స్కాను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. సిటీ స్కాను రూమ్ వద్ద ఉచిత సిటీ స్కాను లేదా ఫ్రీ సిటీ స్కాను అని తెలుగు, ఇంగ్లీషులో నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. పాత సిటీ స్కాను పరిశీలించి మరమ్మత్తులు చేసి ఉపయోగంలోకి తేవాలని ఆయన తెలిపారు. ఎక్స్ రే కొత్తది ఇన్స్టాల్ చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన తెలిపారు. కొత్త రేడియాలజీ రూమ్ ను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో మొత్తం చెత్త చెదారం కనపడడంతో సంబంధిత కాంట్రాక్టర్ పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలలో మొత్తం డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీ నిర్వాహుకుడిని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణతోపాటు కౌంపౌండ్ వాల్ వెంట ఉన్న చెత్త చెదారం ను శుభ్రపర్చడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. ప్రవేశ ద్వారం వద్ద ఫార్మసీ ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా ఆసుపత్రికి రోగులు రాగానే ప్రాథమిక వైద్యం చేయడానికి అయిదు బెడ్లతో రిసెప్షన్ సెంటర్ ప్రక్కన ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఆసుపత్రికి సంబంధించిన పాత ఫైళ్లను బీరువాలలో భద్రపర్చాలని సూపరింటెండెంట్ కు సూచించారు. నల్లగొండ ఆసుపత్రిలో మంచి సేవలు అందిస్తారనే పేరుందని, ఆ పేరుకు తగ్గట్టుగా డాక్టర్లు కృషి చేయాలని ఆయన అన్నారు. ఆసుపత్రిలో అవసరమైన సామాగ్రి, ఇతర మౌళిక సౌకర్యాలపై ప్రతిపాదనలు సిద్దం చేసి తనకు సమర్పించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు వైద్య సౌకర్యాలు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో సర్కారు దవాఖానాలను అన్ని సౌకర్యాలతో మెడికల్ హబ్ గా తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో ప్రైవేటు ఆసుపత్రులు ముద్దు . . ప్రభుత్వ ఆసుపత్రులు వద్దు . . అనే విధంగా ఉండేది అన్నారు. కానీ నేడు ప్రభుత్వ ఆసుపత్రులు ముద్దు . . . ప్రైవేటు ఆసుపత్రులు వద్దు అని ప్రజలు అంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులో అన్ని సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని కార్పోరేట్ హస్పిటల్ మాదిరిగా సూపర్ స్పేషాలిటీ ఆసుపత్రిగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎక్కువ సంఖ్యంలో కాన్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిని ఒక దేవాలయంగా చూసుకోవాలని, అందుకోసం ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మన వంతు బాధ్యత తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండి సరియైన వైద్యం అందిస్తున్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని డాక్టర్లపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజల సహాకారం ఉన్నప్పుడే వైద్యులు రోగులకు సరియైన వైద్యం అందిస్తారని ఆయన తెలిపారు. నల్లగొండ ప్రజల కళగా ఉన్న మెడికల్ కళాశాల జూన్ 4వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంఖుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వద్ద సహకారం కోసం ఒక్కరు మాత్రమే ఉండాలని, మిగతా వారు రోగులను చూడడానికి సందర్శకుల సమయంలో మాత్రమే రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లా కేంద్ర వైద్య శాల (Government Hospital), మాతా శిశు ఆరోగ్య కేంద్రముల (Mother and Child Health Center)లో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎక్సరే రూమ్, రేడియాలజీ రూమ్, ఫార్మసీ, జిల్లా కేంద్ర ల్యాబ్, డయాగ్నస్టిక్ వార్డును, కొత్త డయాలసిస్ వార్డును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఉచిత డయాలసిస్ వార్డులోని పేషెంట్లను చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. పురుషుల మెడికల్ వార్డును సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలను గురించి తెలుసుకున్నారు. మహిళల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త ఐ.సి.యు. వార్డును పరిశీలించారు. రెండవ అంత్తసులో ఉన్న ఆపరేషన్ థియేటర్ ను ఉపయోగంలోకి తేవాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. అదే విధంగా చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త వార్డును పరిశీలించి తగు సూచనలు చేశారు. MICU, SNCV వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో ఆహల్లాదకరంగా ఉండే విధంగా గ్రీనరీ ఏర్పాటు కోసం సూపరింటెండెంట్, మున్సిపల్ శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా వెనుక గేట్ వద్ద తాత్కాలికంగా పోలీస్ అవుట్ పోస్టు నిర్మించాల్సి ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ప్రాంతాలలో సీటింగ్ బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని బాత్ రూమ్స్, టాయ్ లెట్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేదా అవసరమైన మరమ్మత్తులు చేయించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర వైద్య శాల సూపరింటెండెంట్ డా. లచ్చు, డా. అనిత, డా. ప్రశాంత్, డా. రజనీ, డా. యాదగిరి, TSMS IDC EE అజీజ్, మున్సిపల్ కమిషనర్ డా. కె.వి రమణాచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ ప్రదీప్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన సేవలు అందించాలి, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
# స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Share This Post