రోగ నిర్ధారణ కొరకు వైద్య సిబ్బంది శ్యాంపిల్స్ సేకరణ లక్ష్యాలను అధిగమించాలి…

ప్రచురణార్ధం

రోగ నిర్ధారణ కొరకు వైద్య సిబ్బంది శ్యాంపిల్స్ సేకరణ లక్ష్యాలను అధిగమించాలి…

మహబూబాబాద్, అక్టోబర్,04.

ప్రతి పి.హెచ్.సి. పరిధిలో 10 శ్యాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్రంలోని డయాజ్ఞస్టిక్ కేంద్రానికి పంపించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య అధికారి హరీష్ రాజు అధ్యక్షతన వైద్య శాఖ పనితీరుపై పి.హెచ్.సి. డాక్టర్ లతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయలను హెచ్చించి నిరుపేదలకు వైద్య సౌకర్యాలు డయాజ్ఞస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చినా ఉపయోగించుకోలేక పోవడం వైద్య అధికారులు నిర్లక్ష్యం కారణమన్నారు.

ప్రతి పి.హెచ్.సి. నెలలో 300 శ్యాంపిల్స్ సేకరణ లక్ష్యంగా పెట్టుకొని వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి లక్ష్యాలను అధిగమించాలన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యాలను సాధించేందుకు వ్యాక్సిన్ నివేదిక ప్రకారంగా కోవ్యాగ్జిన్ లో 2వ డోస్ ముందుగా పూర్తి చేయాలని, కోవిషీల్డ్ 85 రోజుల సమయం ఉన్నందున వారికి కూడా 2వ డోస్ వేయవల్సిన వారి నివేదిక ప్రకారం క్షేత్ర స్థాయిలో పర్యటించి వ్యాక్సిన్ వేయాలన్నారు.

వైద్యశాలల ఆవరణ పరిశుభ్ర పరిచేందుకు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ సిబ్బంది ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ కు సూచించారు.

వైద్య శాఖ నిధులతో మరమ్మతులు చేపట్టి మరుగుదొడ్లు, విద్యుత్, లీకేజీ లు వంటివి చేపట్టి నిర్వహణ తీరును మెరుగుపరచాలన్నారు.

గ్రామ స్థాయిలో న్యూట్రిషన్, శానిటేషన్ కమిటీలు సర్పంచి అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యం కొరకు తీసుకునే అంశాలపై ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు.

ప్రగతి సాధిస్తున్న హాస్పిటల్ లకు అవసరాలకు కావాల్సిన సామగ్రి ని సమకూరుస్తామన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్,జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఉప వైద్యాధికారులు అంబరీష్, మురళీధర్, డి.పి.ఓ.రఘువరన్, పి.హెచ్.సి.డాక్టర్స్ పాల్గొన్నారు.
——————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం,మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post