రోజుల్లో  వంద  శాతం  కావాలి   ::కలెక్టర్ గోపి 

 రోజుల్లో  వంద  శాతం  కావాలి   ::కలెక్టర్ గోపి
జిల్లా లో వంద శాతం కోవిద్   వ్యాక్సినేషన్ పూర్తి  అయ్యేందుకు  మండల, గ్రామ స్థాయి  అధికారులు ప్రత్యేక  శ్రద్ద వహించాలని  కలెక్టర్  గోపి  అన్నారు
వ్యాక్సినేషన్  ప్రక్రియ ను  వేగవంతం  చేసేందుకు  గాను సోమవారం  జిల్లా కలెక్టర్  గోపి ఎంపీడీఓ,  మెడికల్  అధికారులు, పంచాయితీ  సెక్రటరీ  లతో కలెక్టరేట్ నుండి
 వీడియో  కాన్ఫెరెన్స్  నిర్వహించి  పలు ఆదేశాలు జారీ చేశారు
ఈ సందర్బంగా  కలెక్టర్  మాట్లాడుతూ త్వరితగతిన   వ్యాక్సినేషన్  వంద  శాతం  పూర్తి  చేయడం  పైన ప్రభుత్వ ఆదేశాలను  అందరూ  తూ చ తప్పకుండ పాటించాలన్నారు
ఏ phc లో అయితే  వ్యాక్సినేషన్   శాతం  తక్కువుందో  ఆ మండల  ఎంపీడీఓ, mpo,  పంచాయతీ  సెక్రటరీ లో కో ఆర్డినేషన్  తో పని చేసి  ప్రజలకు  అవగాహన కల్పించి  కోవిద్  టీకాలు ఇప్పించాలన్నారు
ఇందుకు కావలిసిన  ప్రణాళిక  ను రూపొందించి  మరో 15 రోజుల్లో  వంద శాతం  వ్యాక్సినేషన్  అయ్యేలా అధికారులు  పని చేయాలన్నారు
ప్రతీ  ఇంటికి వెళ్లి  వ్యాక్సిన్  వేసుకున్నారా  లేదా అని చెక్ చేయాలన్నారు…
వ్యాక్సినేషన్  ప్రాధాన్యత  ను తెలియజేయాలన్నారు
ఈ vc లో అడిషినల్  కలెక్టర్  హరి  సింగ్, dmho  వెంకటరమణ,    నర్సంపేట DLPO వెంకటేశ్వర్లు, డిప్యూటీ  dmho లు పాల్గొన్నారు

Share This Post