రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం టి.టి.డి.సి సమావేశ మందిరంలో జరిగిన రోడ్డు భద్రతా జిల్లా స్థాయి. కమిటీ సమావేశంలో పోలీసు కమిషనర్ విష్ణు.యస్.వారియర్తో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ప్రచురణార్ధం..

సెప్టెంబరు 06 ఖమ్మం:

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం టి.టి.డి.సి సమావేశ మందిరంలో జరిగిన రోడ్డు భద్రతా జిల్లా స్థాయి. కమిటీ సమావేశంలో పోలీసు కమిషనర్ విష్ణు.యస్.వారియర్తో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ అండ్.బి. జాతీయ రహదారులు, పంచాయితీరాజ్, పోలీసు శాఖల సమన్వయంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జంక్షన్లు, మూలమలుపుల, కల్వర్టులు, జాతీయ రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాలకు కారణాలను గుర్తించి ఇకముందు అట్టి ప్రమాదాలు సంభవించకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. స్పీడ్ బ్రేకర్లు, రేడియం సూచికలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు గుర్తించిన బ్లాగ్ స్పాట్ల  వద్ద ఏర్పాటు చేయాలని, బ్లాగ్ స్పాట్లలోని ఆక్రమణలను తొలగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రధానంగా ఖమ్మం కౌణిజర్ల మార్గ మధ్యంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవించాయని, ప్రమాదాల నివారణకు అనుబంధ శాఖల అధికారులు సమీక్షించుకొని ఇకముందు జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను పూర్తిగా తగ్గించాలని కలెక్టర్. సూచించారు.

పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పూర్తిగా తగ్గించాలని సుప్రీంకోర్టు హైపవర్ కమిటీ సూచించిందని, ఈ సంవత్సరం జిల్లాలో ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు గాను అనుబంధ శాఖల అధికారులు పోలీసు వారికి సహకరించాలని ఆయన అన్నారు. కల్లూరు, సత్తుపల్లి, కొణిజర్ల ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నదని, ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు, బారికేడ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని, తద్వారానే ప్రమాదాల సంఖ్యను తగ్గించ గల్గుతామన్నారు.

ఏ.ఎస్.పి. స్నేహ మెహరా, అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనర్ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రవాణా శాఖాధికారి కిషన్, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు. ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, ఏ.సి.పిలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి. వెంకటేశ్వర్లు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post