రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాలిసిన దీర్ఘకాలిక చర్యల పైన వెంటనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు .

గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కమిటీ మీటింగ్ జరిగింది.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్, రెవిన్యూ, పోలీస్, పంచాయతీ, రోడ్లు, భవనాల శాఖ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు సంయుక్తంగా పనిచేసి సమస్యాత్మక రోడ్లను ,ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలన్నారు.

స్పీడ్ లిమిట్ నోటిఫై చేసి బోర్డులను ఏర్పాటు చేయాలనీ, ప్రమాదాల నివారణకు తీసుకోవాలిసిన జాగ్రత్తలపై వెంటనే action ప్లాన్ సిద్ధం చేయాలనీ తెలిపారు.

ముఖ్యమైన కూడళ్ల వద్ద, స్కూల్, కాలేజ్ లు, హాస్పిటల్ , PR , R&B రోడ్ల వద్ద మార్కింగ్ ఉండాలని, స్పీడ్ బ్రేకర్లు తప్పనిసరిగా ఉండాలని, హెచ్చరిక బోర్డులు, స్టిక్కర్స్ లని ఏర్పాటు చేయాలన్నారు.

టూ వీలర్ వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని…. ఈ అంశంపైన కఠినమైన నిఘా పెట్టాలిసిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశం లో dcp వెంకట లక్ష్మి, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి అఫ్రిన్ సిద్దిఖీ, Rtc DVM శ్రీదేవి , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post