రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-3

తేదీ 26.4.2022

ప్రచురణార్థం----3 తేదీ 26.4.2022   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు:: జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల ఏప్రిల్ 26:-జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు.  ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారుల, ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీ రోడ్ల వద్ద ఉన్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  రోడ్డు సమీపంలో గల బావుల వద్ద గేట్ వాల్ ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ నిధులతో వీటిని చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రోడ్లపై వ్యూ అంతరాయం కలగకుండా పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని, దాని కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వినియోగిస్తున్న ట్రాక్టర్లు కేజీ వీల్స్ సమస్య రాకుండా చూడాలని, సీజ్ చేసిన వాహనాలను పట్టి కోనుగోలు చేసిన అనంతరం మాత్రమే విడుదల చేయాలని కలెక్టర్ సూచించారు.  కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్ పి సింధు శర్మ మాట్లాడుతూ 2021 సంవత్సరంలో 199 అవగాహన కార్యక్రమాలను ట్రాఫిక్ పోలీస్ ద్వారా చేపట్టామని అన్నారు.  జిల్లాలో ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 2093 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, వీటిలో మైనర్లు సైతం ఉన్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య దురదృష్టవశాత్తు తగ్గడం లేదని అన్నారు. జనవరి నుంచి మార్చి మాసం వరకు 115 వాహన ప్రమాదాలు జరిగాయని, వీటిలో సగం కంటే అధికంగా జాతీయ రహదారి లో 4, 5 ప్రదేశాలు జరిగాయని తెలిపారు. ధర్మపురి ,జగిత్యాల రూరల్ మెట్పల్లి, మేడిపల్లి, కోరుట్ల ప్రాంతాల్లోని జాతీయ రహదారులో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారులపై ఉన్న పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని, రేడియం స్టిక్కర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని అంతర్గత ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్డు మరమ్మత్తు ప్రాంతాల్లో శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా రవాణా అధికారి శ్యాం నాయక్ , ఎం.వి.ఐ. వంశిధర్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీధర్, జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీధర్ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూపరాని, ఈఈ పంచాయతీ రాజ్,ఈఈ ఆర్ అండ్ బీ, టౌన్ ప్లానింగ్ అధికారి శాఖ అధికారి సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాల గారిచే జారీ చేయనైనది
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల ఏప్రిల్ 26:-జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు.

ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారుల, ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీ రోడ్ల వద్ద ఉన్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

రోడ్డు సమీపంలో గల బావుల వద్ద గేట్ వాల్ ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ నిధులతో వీటిని చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రోడ్లపై వ్యూ అంతరాయం కలగకుండా పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని, దాని కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వినియోగిస్తున్న ట్రాక్టర్లు కేజీ వీల్స్ సమస్య రాకుండా చూడాలని, సీజ్ చేసిన వాహనాలను పట్టి కోనుగోలు చేసిన అనంతరం మాత్రమే విడుదల చేయాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్ పి సింధు శర్మ మాట్లాడుతూ 2021 సంవత్సరంలో 199 అవగాహన కార్యక్రమాలను ట్రాఫిక్ పోలీస్ ద్వారా చేపట్టామని అన్నారు.

జిల్లాలో ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 2093 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, వీటిలో మైనర్లు సైతం ఉన్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య దురదృష్టవశాత్తు తగ్గడం లేదని అన్నారు. జనవరి నుంచి మార్చి మాసం వరకు 115 వాహన ప్రమాదాలు జరిగాయని, వీటిలో సగం కంటే అధికంగా జాతీయ రహదారి లో 4, 5 ప్రదేశాలు జరిగాయని తెలిపారు.

ధర్మపురి ,జగిత్యాల రూరల్ మెట్పల్లి, మేడిపల్లి, కోరుట్ల ప్రాంతాల్లోని జాతీయ రహదారులో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు.

జాతీయ రహదారులపై ఉన్న పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని, రేడియం స్టిక్కర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాలోని అంతర్గత ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్డు మరమ్మత్తు ప్రాంతాల్లో శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లా రవాణా అధికారి శ్యాం నాయక్ , ఎం.వి.ఐ. వంశిధర్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీధర్, జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీధర్ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూపరాని, ఈఈ పంచాయతీ రాజ్,ఈఈ ఆర్ అండ్ బీ, టౌన్ ప్లానింగ్ అధికారి శాఖ అధికారి సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాల గారిచే జారీ చేయనైనది

Share This Post