ప్రచురణార్ధం
రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నెళ్ళికుదురు,
మహబూబాబాద్ జిల్లా, ఆగస్ట్-17:
మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మహబూబాబాద్ నుండి నెళ్లికుదురు రహదారి మధ్యలో 14 కిలోమీటర్ ల పొడవునా చేపట్టిన FDR రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు.
ముందుగా ఆలేరు గ్రామం వద్ద, సంధ్యా తండా, కాస్య తండా, మునిగలపాడు వద్ద చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ R&B అధికారులను పనులు నాణ్యతగా చేపట్టలేదని, రోడ్డు మరమ్మతు పనులు ఎగుడు దిగుడుగా, రోడ్డు లెవెల్ కు సరిగా లేకపోవడం, చేసిన ప్యాచ్ వర్క్ పనులలో గుంతలు ఏర్పడి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు డ్రా చేయటంలో ఉన్న శ్రద్ధ రోడ్డు మరమ్మతు పనులు చేయడంలో లేదని, పర్యవేక్షణ లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు మరమ్మతులు చేసినప్పుడు పై, పైనే సంభందిత మెటీరియల్ వేసినట్లు అర్థం అవుతుందని, మరమ్మతు పనులలో నాణ్యత లోపించిందని కలెక్టర్ తెలిపారు.
రోడ్డు మరమ్మతు చేసేటప్పుడు ఏ విధమైన మెటీరియల్ వాడారు, ఇతర వివరాలను సంభందిత అధికారులు కలెక్టర్ కు వివరించారు.
మార్గమధ్యలో రావీరాల లో రోడ్డుకు ఇరువైపులా చేపడుతున్న అవెన్యూ ప్లాంటేషన్ రంగుల, రంగుల ట్రీ గార్డ్స్ తో ఆకట్టుకున్నదని, పనులు చక్కగా చేపట్టడంతో రావిరాల సర్పంచ్ అనిల్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ. వేణుగోపాల్ రెడ్డి, ఎం.పి.పి. మాధవి, ఇ.డి.ఎస్సీ కార్పొరేషన్, నెళ్ళికుదురు స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, R&B ఇ.ఈ – తానేశ్వర్, డి.ఈ.- రాజేందర్, ఏ. ఈ. లు సందీప్, శ్యామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
—————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.