రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

పత్రిక ప్రకటన
తేది :21.11.2022
నిర్మల్ జిల్లా సోమవారం

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అభివృద్ధి పనులు చేపడుతున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. రూ. 28 కోట్ల వ్య‌యంతో నిర్మించనున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ‌ ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ తో కలసి భూమిపూజ చేశారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… నిర్మ‌ల్ జిల్లా కేంద్రం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ద‌ని, ప్ర‌జ‌ల అవ‌సరాల‌కు అనుగుణంగా ద‌శ‌ల‌వారీగా ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నామ‌ని అన్నారు. కోట్లాది నిధులను వెచ్చించి నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంతో పాటు చుట్టుప‌క్క‌లా కూడా ర‌హ‌దారుల నిర్మాణం, విస్తర‌ణ ప‌నులు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. (జాతీయ రహదారి రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా వెళ్లే రోడ్డు) క్ర‌ష‌ర్ రోడ్డు నుంచి ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ మీదుగా బంగ‌ల్ పేట్ వ‌ర‌కు నాలుగు వ‌రుస‌లుగా ఈ ర‌హ‌దారిని విస్త‌రిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. పూర్తిస్థాయిలో ఈ రహదారి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయ‌ని , సాఫీగా ప్రయాణం సాగడంతో పాటు రోడ్డు పరిసర ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

Share This Post