రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పెంచే బాధ్యత అటవీ శాఖ అధికారులదేనని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి సూచించారు.

 

గురువారం ఎడపల్లి మండలం జాన్కంపెట్, ఎడపల్లి గ్రామాలలో రహదారికి ఇరువైపులా పెంచుతున్న అవెన్యూ ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో ఎడపల్లి మండలం జాన్కంపెట్, ఎడపల్లి గ్రామాలలో రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ లో బాగంగా చెట్లను పెంచే బాధ్యత పూర్తిగా అటవీశాఖ అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీ ఒకరు కృషి చేయాలనీ, ఈ మహత్తర కార్యక్రమములో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో చెట్లను ఏపుగా పెంచేవిదంగా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు అవెన్యూ ప్లాంటేషన్ లో చెట్లను పెంచే విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, నిర్లక్షం వహించే అధికారులపై చర్యలు తప్పవని, రోడ్లకు ఇరువైఫుల చెట్లను నాటి వాటికీ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలనీ, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. చెట్లను పెంచడం ద్వారా వాతావరణం కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చని, హరిత తెలంగాణ సాధించే దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒకరు భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అటవీశాఖ నిజామాబాద్ రేంజ్ అధికారి పద్మారావు, ఎడపల్లి తహసీల్దార్ లక్కం ప్రవీణ్ కుమార్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post