ర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మహిళా శిశు సంక్షేమ అధికారులకు సూచించారు.

బుధవారం నాడు యాదగిరిగుట్ట మండలం బాహు పేట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం వారోత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గర్భవతులకు,  బాలింతలకు, పిల్లలకు పోషక విలువలు కలిగినటువంటి పౌష్టికాహారం ఇవ్వాలని, ప్రతి కుటుంబంలో మగవారు కూడా ఆడవారికి సహకరిస్తూ చేదోడువాదోడుగా ఉండాలని,  ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.  ఒక పాపను తను ఏ గ్రేడ్ లో ఉన్నారు,  బరువు తోటి తను ఏ స్థితిలో ఉన్నారని అంగన్వాడీ టీచర్ ని అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తక్కువ బరువుతో పుట్ట రాదని,  దీనికోసం గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసము అన్న ప్రాసన నిర్వహించారు. అంతే కాకుండా అంగన్వాడి సెంటర్ లో పోషక వారోత్సవాల సందర్భంగా ఆహారపు వంటల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి  కృష్ణవేణి, ఎంపిపి చీర శ్రీ శైలం, ఎంపిడిఓ,  ప్రాజెక్ట్ అధికారి సి డి పి ఓ చంద్రకళ,  గ్రామ సర్పంచ్ కుండే పద్మ, మెడికల్ ఆఫీసర్ వంశీకృష్ణ గారు, సూపర్వైజర్లు జంగమ్మ, యు.ఎన్ వాడి టీచర్స్,  గ్రామంలోని తల్లులు, మహిళలు పాల్గొన్నారు.

Share This Post