ప్రెస్ రిలీజ్.
తేదీ.2.6.2022.
ములుగు జిల్లా.
తెలంగాణ స్ఫూర్తితో కవిసమ్మేళనం నిర్వహణ:: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య
00000
తెలంగాణ స్ఫూర్తితో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించామని కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా వేడుకలు ఘనంగా నిర్వహించలేకపోయామని, ప్రస్తుత సంవత్సరం ప్రభుత్వ ఆదేశాలతో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో సైతం కవులు,రచయితలు కీలక పాత్ర పోషించారని, రచనలతో ఉద్యమ స్ఫూర్తి నింపారని అన్నారు.
కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులు తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై 3 నిమిషాల సమయం మించకుండా కవితలు చెప్పారని తెలిపారు.
అనంతరం కవి సమ్మేళనం కార్యక్రమంలో కవులు తమ కవితలను, రచనలు గేయాలను వినిపించారు.
అనంతరం కవి సమ్మేళననం కార్యక్రమంలో పాల్గొన్న కవులకు రూ.2 వేల నగదు, మెమోంటో, ప్రశంసపత్రం, శాలువతో కలెక్టర్ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్ , ఆర్డీవో రమాదేవి , సంబంధిత అధికారులు, కవులు, తదితరులు.