లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు – కలెక్టర్

 

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం జిల్లాలో కొత్తగా 102 మద్యం దుకాణాల అనుమతికై దరఖాస్తులు స్వీకరించగా వచ్చిన 1672 దరఖాస్తులకు అనుగుణంగా ఓపెన్ లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేయడం జరిగిందని, మరో మూడు దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వచ్చినందున ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం మద్యం పాలసి 2021-2023 సంవత్సరాలకుగాను లక్కీ డ్రా ద్వారా అర్హులను ఎంపిక చేయడానికి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు
రూల్స్ ప్రకారం ఈ లక్కీ డ్రా పద్ధతిని దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.
దుకాణాల కేటాయింపుకై 18-11-2021 వరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు గాను 1672 అప్లికేషన్స్ రావడం జరిగిందన్నారు. 102 దుకాణాలకు అనుమతి
ఇవ్వాల్సి ఉండగా 3 షాప్స్ లకు స్పందన తక్కువ ఉండటం వల్ల డ్రా తీయలేదని తెలిపారు. అందువల్ల
8, 36, 99 నంబరు గల షాపులకు డ్రా తీయలేదన్నారు. మిగతా 99 షాపులకు డ్రా పూర్తి చేశారు. చాలా ట్రాన్స్పరెన్సీగా అప్లికేషన్స్ వారి సమక్షంలోనే లక్కీ డ్రా ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర, ఇన్చార్జి డిసి శ్రీనివాస్, డీసీపీ అరవింద్ బాబు, నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ నందగోపాల్, ఏసిపి వెంకటేశ్వర్లు దరఖాస్తుదారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post