లక్నవరం, బోగత జలపాతాలు   ప్రకృతి ప్రసాదించిన వరం: రాష్ట్ర సమాచార కమీషన్ గుగులోతు శంకర్ నాయక్

వార్త ప్రచురణ
తేదీ.18.09.2021.
ములుగు జిల్లా:

ములుగు జిల్లాలో శనివారం రోజున  తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ డా. గుగులోతు శంకర్ నాయక్  తాడ్వాయి మండలం లోని గిరిజనుల ఆరాధ్య దైవం అయిన మేడారం సమ్మక్క సారలమ్మ లను అధికారిక లాంఛనాలతో అమ్మవార్లను సతి సమ్మేతంగా దర్శించకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వాజేడు మండలం  లోని బొగత జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రకృతి అందాలను చూసి  పరవశించేల కొండలు ,వాగులు, అడవి సంపద  ప్రజలకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ఆయన అన్నారు. ములుగు జిల్లా పర్యాటక రంగం గా మునుముందు అబివృద్ది చెందుతుందని వారు అన్నారు. అనంతరం లక్నవరం అటవీ ప్రాంతంలోని రోప్ వె  బ్రిడ్జ్ అందాలను తిలకించారు. లక్నవరం సరస్సు లో బోటింగ్ అద్బుతం అని అన్నారు. లక్నవరం, బోగత జలపాతంలు  ప్రకృతి ప్రసాదించిన వరం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అయా మండలాల తహశీల్దార్ లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post