ఈనెల 12న జిల్లా కేంద్రంలో ఒకే రోజు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా తో కలిసి నల్గొండ పట్టణం లో మొక్కలు నాటే ప్రదేశాలు ఎస్.ఎల్.బి.సి.,దేవరకొండ రోడ్డు మీడియన్ లో,రైల్వే స్టేషన్ సావర్కర్ దగ్గర క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న జిల్లా కేంద్రంలో లక్ష మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎలాంటి పోరపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.శనివారం కూడా ఏర్పాట్లు పరిశీలించి పర్యవేక్షణ చేయాలని అదనపు కలెక్టర్ ను ఆయన ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి,పరిశ్రమల శాఖ జి.యం.కోటేశ్వర రావు,మున్సిపల్ అధికారులు ఉన్నారు
