వాక్సిన్ కొరకు వచ్చిన ప్రజలకు వాక్సిన్ తీసుకోవడం వల్ల మాత్రమే ఈ మహమ్మారిని జయించగలమని అవగాహన కల్పించారు. వాక్సినేషన్ కొరకు ప్రజలకు అవగాహన కల్పించుటలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మరింత మందిని సమీకరించడానికి అవకాశం ఉందని చెప్పారు. గట్టుమల్లలోని శ్మశానవాటికను పరిశీలించి నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదని గమనించారు. పూర్తి ఆకారంలో శ్మశానవాటికను రానున్న 10 రోజుల్లో పూర్తి చేసి నివేదికలు అందచేయాలని ఎంపిడిఓ ను ఆదేశించారు. గట్టుమల్ల పాఠశాలలో వర్షపు నీటి నిల్వలు లేకుండా చేయాలని పంచాయతి సిబ్బందిని ఆదేశించారు.