లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిశగా కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుంది
జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
0 0 0 0
లక్ష్యాన్ని నిర్థేశించుకుని ఆదిశగా కృషిచేసినట్లయితే అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలరని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే ప్రతిఒక్కరు మీ అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆదిశగా కష్టపడ్డప్పుడే మీరు కలలు కనే మార్గానికి చేరుకుంటారని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మొత్తంలో అతితక్కువగా పోటిపరీక్షలకు నోటిఫికేషన్ లు విడుదల అయ్యేవని, కాని ఇప్పడు వందల సంఖ్యలో పోస్టుల భర్తికి నోటిఫికేషన్లు విడుదల చేసారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకొవాలని పిలుపునిచ్చారు. పోలీస్ ఉద్యోగాన్ని తట్టుకోవాలంటే చురుకుదనంతో పాటు, గరుకుదనం కూడా ఉండాలని, మనచుట్టు ఉన్న పరిసరాలు, పరీస్థితులు మరియు జరిగిన సంఘటల గురించి కూడా తెలుసుకోవాలని అన్నారు. పోటితత్వం సడలిపోకుండా పోలీస్ శాఖలో నాతో పాటు కష్టపడి చదివి ఎస్సైలుగా మరియు ఉన్నత స్థానాలను సాధించిన వారితో ఒరియంటేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తానని అన్నారు. మహిళల కొరకు ఈసారి ఎప్పడు లేనివిధంగా ప్రాదాన్యతను కల్పించడం జరిగిందని, వారు కష్టపడి ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కష్టపడి ఉద్యోగాలను సాధించుకున్నట్లయితే సమాజంలో మీతో పాటు మీ తల్లితండ్రులను గొప్పగా కీర్తింపబడతారని అన్నారు. పోటిపరీక్షల కొరకు అంతిమ లక్ష్యాన్ని నిర్థేశించుకని ఫలితాన్ని సాధించుకోవాలని పేర్కోన్నారు. పోటిపరీక్షల కొరకు సిద్దమయ్యే వారికోసం అవసరమైన సహాకారాన్ని అందిస్తామని హమి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిసిపి శ్రీనివాస్, ఎర్ఎసిపి ప్రతాప్, వారిది సోసైటి ప్రతినిధులు ఆంజనేయులు తదితరులు పాల్గోన్నారు.