లక్ష్యాల మేరకు పథకాలు గ్రౌండింగ్ కావాలి.. అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

లక్ష్యాల మేరకు పథకాలు గ్రౌండింగ్ కావాలి.. అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

వివిధ భ్యాంకులకు కేటాయించిన యూనిట్లను గ్రౌండ్ అయ్యేలా చూడవలసినదిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ బ్యాంకర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ 2017-18 నుండి 2020-21 వరకు ఎస్సి, ఎస్టీ, బి.సి. మైనారిటీ తదితర పథకాలకు సంబంధించి బ్యాంకులకు సబ్సిడీ నిధులు వచ్చినా పథకాలు గ్రౌండ్ కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదమే లేదా తిరస్కరించడమో చేయాలని, పెండింగులో పెట్టుకోరాదని హితవు పలికారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, కె.వి.ఐ.సి. క్రింద పెండింగులో ఉన్న 29 యూనిట్లను ఈ నెల 30 లోగా గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు. ఎంతో ప్రాధాన్యత గల వ్యవసాయ రంగంలో పంట రుణాలు, టర్మ్ లోన్ అందించుటలో చాలా బ్యాంకులు వెనుకబడి ఉన్నాయని, సకాలంలో రుణాలు అందించి అన్నదాతలను ఆదుకోవాలని సూచించారు. రైతులు బకాయి పడ్డ రుణ వివరాలను మండలం వారీగా జిల్లా వ్యవసాయాధికారికి అందిస్తే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రికవరీకి చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు. డి.ఆర్.డి.ఓ. కార్యక్రమాన్ని సమీక్షిస్తూ జిల్లాలో 10,761 స్వయం సహాయక సంఘాలకు 386 కోట్ల రూపాయలు అందించాలని లక్ష్యం కాగా కేవలం 31. 5 శాతం లక్ష్యం సాధించామని, బ్యాంకుల నియంత్రణ అధికారులు లక్ష్య సాధనలో వేగవంతం చేయాలని సూచించారు. సూక్ష్మ ఆహార శుద్ధి పధకం క్రింద పంపిన 9 ప్రతిపాదనలు గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు. వీధి వ్యాపారాలకై ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా 1700 పెండింగులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరికీ తక్షణమే రుణాలు మంజూరు చేయాలని కోరారు. యూనిట్లు గ్రౌండింగ్ అయినవాటికి యు.సి. లు, ఫోటో లు పంపాలని అన్నారు. పందిరి సాగుకు వచ్చిన 40 యూనిట్లను గ్రౌండ్ చేయాలన్నారు. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద మునిసిపల్, గ్రామా పంచాయతీలలో పారిశుధ్య కార్మికులకు ఈ నెల 30 లోగా భీమా కల్పించి ధ్రువపత్రాలు అందజేయాలని సూచించారు. గ్రామీణ స్వయం ఉపాధి హామీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎస్.బి.ఐ వారు వృత్తి నైపుణ్యాభివృధికి శిక్షణ ఇస్తున్నారని వివిధ సంక్షేమ శాఖల అధికారులు శిక్షణ అవసరమైన లబ్దిదారులను గుర్తించాలని వారికి మెదక్ పట్టణంలోనే శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. జిల్లాలో వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు 35 మంది లబ్దిదారులకు ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, నాబార్డ్ డిడిఎం లు సెసిల్ తిమోతీ , జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్ రావు, డి.ఆర్.డి ఓ. శ్రీనివాస్, డి.ఏ.ఓ. పరశురామ్ నాయక్, ఎస్సి కార్పొరేషన్ ఈ డి. దేవయ్య, బి.సి.సంక్షేమాధికారి జగదీశ్, డి.టి. డబ్ల్యూ, ఓ. ఫిరంగీ, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ , డి.ఆర్.డి.ఏ. అదనపు పి .డి. భీమయ్య , వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post