లఘు చిత్రాల పోటీలకు ఆహ్వానం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 05, 2021ఆదిలాబాదు:-

స్వచ్ఛత ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ లఘు చిత్రాల పోటీల్లో పాల్గొనే వారు ఈ నెల 15 లోగా పంపించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ త్రాగునీటి పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు, అర్హత అనుభవం కలిగిన వారు లఘు చిత్రాలను చెల్లుబాటు అయ్యే యాక్టీవ్ ఇమెయిల్ ఐడి తో లఘు చిత్రాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలి. అప్ లోడ్ లింక్ ను https://innovateindia.mygov.in/sbmg-innovation-challenge/competition లో పార్టిసిపేషన్ ఫారంలో నింపాలి. గ్రామాల్లో తడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణ, గోబర్దాన్, మల బురద నిర్వహణ, స్వచ్ఛ భారత కోసం గ్రామంలో ప్రవర్తన మార్పు అంశాలపై లఘు చిత్రాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాలలో పోటీ చేయడానికి 10 సంవత్సరాల పై బడిన భారత పౌరులు అర్హులని,  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నీరు, పారిశుధ్య శాఖల లో పనిచేస్తున్నవారు, వారి బంధువులు మినహా భారత పౌరులు ఎవరైనను ఈ పోటీల్లో పాల్గొనవచ్చును. పైన తెలిపిన అంశాలకు సంబంధించిన లఘు చిత్రాలు ఒకటి నుంచి ఐదు నిమిషాలలోపు నిడివి కలిగి ఉండాలని తెలిపారు. ఈ పోటీలలో ఉత్తమ చిత్రాలుగా ఎంపిక అయిన వాటికీ మొదటి బహుమతి ఒక లక్ష 60 వేల రూపాయలు, మొదటి రన్నర్ కు 60 వేల రూపాయలు, రెండవ రన్నర్ కు 30 వేల రూపాయలు అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. లఘు చిత్రాలను ఈ నెల 15 లోగా పంపించాల్సి ఉంటుందని, మరింత సమాచారం కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ… స్వచ్ఛ భారత్ విభాగం ఆదిలాబాద్ సెల్ నంబర్ 9440010821, 9989934111, 7013570173, 9705600632 ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post