లబ్దిదారులందరికీ ఇండ్లు ఇప్పించి, పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలని జాతీయ బిసి కమీషనర్ ఆచార్య తల్లోజి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                         తేదీ: 11-10-2021

లబ్దిదారులందరికీ ఇండ్లు ఇప్పించి, పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలని    జాతీయ బిసి కమీషనర్ ఆచార్య తల్లోజి  తెలిపారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జాతీయ బి.సి కమీషనర్ ఆచార్య తల్లోజి , జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ పేదవారికి కేటాయించిన భుములలోనే వారికి ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కలెక్టర్ ను కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు. పేదలకు భూములు కేటాయించి, వాటికి సంబంధించిన  పట్టా సర్టిఫికేట్ లను కుడా అందించాలని అన్నారు. స్థలాలు పొందిన వారు నిజమైన లబ్దిదారుల కాదా అని ఎంక్వయిరీ చేసి, పూర్తి వివరాలను పరిశీలించిన తరువాతే పట్టా సర్టిఫికేట్ లను ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. పేదవాడికి గూడు , నీడ కావాలని ఎవరికీ అన్యాయం జరగకుండా   లబ్దిదారులందరూ స్థలం పొందేలా చూడాలని అన్నారు. బి.సి ల పై  , పేదవారి పై తప్పుడు కేసు లు పెట్టవద్దని అన్నారు. అన్యాయం జరిగితే కేసు ఫైల్ చేయాలనీ, ప్రతి కేసు 24 గంటల్లో కోర్టు కి వెళ్తుందని అన్నారు. పోలీస్  పరిధిలో ఉన్న ప్రతి కేసు ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకోవాలని ఎస్పి రంజన్ రతన్ కుమార్ ను కోరారు. ప్రభుత్వం కేటాయించిన భూమి ని సర్వే చేసి లీగల్ గా లె అవుట్ చేయాలనీ అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , ఎస్ పి రంజన్ రతన్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ,  తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Share This Post