లబ్ది దారులు రేషన్ సరుకు ఎక్కడైనా తీసుకోవచ్చు కలెక్టర్ కోయ శ్రీ హర్ష

లబ్ది దారులు  రేషన్ సరుకు ఎక్కడైనా తీసుకోవచ్చు  కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉదయం  నారాయణపేట మండలం సింగారం, లింగంపల్లి మరియు ధన్వాడ మండల కేంద్రం లోని 4606001, 4602008, 4602003 నెంబర్లు గల చౌక ధర దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్బంగా       లబ్దిదారులు రేషన్ కార్డు ఉంటే ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చన్నారు.  చోకధర దుకాణాలను పరిశీల సనర్బంగా అక్కడ నిల్వ ఉన్న బియ్యం ను పరిశీలించారు. ఎంత స్టాక్ మిగిలింది వాటి వివరాలను రిజిస్టర్ లో పరిశీలించారు.  లబ్దిదారులు ప్రతి ఒక్కరు సరుకు లను తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. గ్రామా పంచాయతి లో ఉన్న కార్డు లు ఎన్ని వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అందించిన బియం వివరాలు ఇంకా షాపులలో నిల్వ ఉన్న వాటిని పరిశీలించారు. అనంతరం ధన్వడ మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖి చేసి సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రికి సమయానికి చేరుకోవాలని వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించినప్పుడే ఓపి లు పెరుగుతయన్నారు. ఆసుపత్రి మొత్తాన్ని తిరి పరిశీలించారు. మొత్తం సిబ్బంది వివరాలను వారి యొక్క పని వైద్యుని  ద్వార అడిగి తెలుసుకున్నారు.

తనిఖి సమయం లో సివిల్సప్లై అధికారి శివప్రసాద్, డిటి కలప్ప తదితరులు ఉన్నారు.

Share This Post