లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి…

ప్రచురణార్ధం

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి…

మహబూబాబాద్, సెప్టెంబర్,21.

రెండు పడక గదుల ఇండ్ల మంజూరిలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరపాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో రెండు పడక గదుల ఇండ్లు, కళ్యాణలక్ష్మీ, ఆపద్బాందు,సాదా బైనామా,కోర్ట్ కేసులు, ధరణి పోర్టల్ దళితులకు 3 ఎకరాలు భూ పథకం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు పడక గదుల ఇండ్లు రూప్ లెవెల్ లో ఉన్నప్పుడే లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభ ద్వారా పారదర్శకంగా చేపట్టాలన్నారు.

ఇంజనీరింగ్ అధికారులతో పూర్తవుతున్నాయిన ఇండ్ల నివేదిక తీసుకోవాలని నివేదిక ఆధారంగా ఆయా ప్రాంతాలలోని లబ్ధిదారులను గుర్తించి నివేదిక రూపొందించాలన్నారు.

ఆపద్బంధు పథకం వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయం నుండి తెప్పించుకోవాలన్నారు.

మీసేవ ద్వారా ధరణి పోర్టల్ పై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.

దళితులకు పంపిణీపై మూడెకరాల భూమి కొనుగోలుకు నిధులు ఉన్నందున తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు.

కోర్టు కేసులు పెండింగ్లో ఉంచరాదని
వెంటనే పరిష్కరించాలి సిందిగా ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య కార్పొరేషన్ ఈడీ బాలరాజు 16 మండలాల తాసిల్దారులు పాల్గొన్నారు.
—————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post