లాటరీ ద్వారా మద్యం దుకాణాల రిజర్వేషన్లు ఖరారు చేసిన – జిల్లా కలెక్టర్ హరీష్

లాటరీ ద్వారా మద్యం దుకాణాల రిజర్వేషన్లు ఖరారు చేసిన – జిల్లా కలెక్టర్ హరీష్

2021-23 నూతన ఆబ్కారీ విధానంలో రిటైల్ మద్యం దుకాణాల ఎంపికను సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ విధానంలో ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులకు రిజర్వు అయిన వాటితో పాటు ఇతర గిరిజనులకు మరో 5 శాతం, ఎస్సైలకు 10, గౌడ లకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాగా అందుకనుగుణంగా దుకాణాల కేటాయింపు కై కమిటీ సభ్యులైన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ అధికారి సమక్షంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్ లు లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 49 వైన్ షాపులకు గాను ఎస్సి, ఎస్టీ, గౌడ్ లకు 30 శాతం రిజర్వేషన్ గా 16 దుకాణాల కేటాయింపుకు రొటేషన్ (సైకిల్ సిస్టం ) పద్దతిలో ఎస్టీ.,ఎస్సి., గౌడ్ లకు వరుసగా లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. 2019-21 వరకు అమలులో ఉన్న ఆబ్కారీ విధానం గత నెలలో ముగియగా ప్రభుత్వం ఈ నెల వరకు లైసెన్స్ పొడిగించింది.
దుకాణాల కేటాయింపులు ఇలా… ఎస్టీ ఒకటి, ఎస్సి 6, గౌడ్ కులాలలకు 9 దుకాణాలు.
S.T. :
Shop No.16: Kolcharam mandal Rangampet
S.C.
Shop numbers: 8:- Alladurg, 28:- Manoharabad Mandal Kallakal shop No.2: 30:-Kowdipally shop No.1,
37-: Ramayampet Municipality No.3, 39: -Chegunta No.2: 41-: Yeldurthy shop No.2
Gouds :
Shop numbers: 13-Papannapet mandal Podichanpally shop no.2 : 17-Regode, 23-Narsapur municipality no.1
25-Narsapur municipality no.3, 34: Manoharabad, 36-Ramayampet municipality no.2, 40-Yeldurthy shop no.1, 43-Narsingi, 47-Shankarampet-R no.1
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్, ఆబ్కారీ సూపరింటెండెంట్ రజాక్, డి.ఎస్.డి.ఓ. విజయలక్ష్మి, బి.సి. అభివృద్ధి అధికారి జగదీశ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణ్ రెడ్డి, ఆబ్కారీ శాఖా సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post