లాటరీ ద్వారా 93 మద్యం దుకాణాలు కేటాయింపు  పారదర్శకంగా మద్యం షాపుల డ్రా  జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

లాటరీ ద్వారా 93 మద్యం దుకాణాలు కేటాయింపు

పారదర్శకంగా మద్యం షాపుల డ్రా

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000

జిల్లాలో 94 మద్యం దుకాణాలకు గాను 93 దుకాణాలను లక్కీడ్రా ద్వారా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్. వి  కర్ణన్ తెలిపారు.

శనివారం రోజున ఉదయం 11 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో  జరిగినటువంటి డ్రాలో A4 లిక్కర్ రిటైల్ షాపులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 94 షాపులకు గాను 93 షాపులకు డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్,
అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ తో హాజరై ఒక్కో షాపుకు సంబంధించి టోకెన్ తీసి డ్రా లో విజేతలను ప్రకటించారు. ఇట్టి కార్యక్రమం లో షాపులు దక్కించుకున్న వారు ఒక సంవత్సరం స్లాబ్ కి 1/6 వంతు అమౌంట్ శనివారం  రోజే చెల్లించారు. అత్యధికంగా కరీంనగర్ రూరల్ పరిధిలోని చింతకుంట షాపుకు 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పపంగా కరీంనగర్ రురల్ పరిధిలోని ముగ్ధంపూర్ షాపుకు 5 గురు మాత్రమే దరఖాస్తు రాగా ఆ షాపును డ్రా తీయకుండా వాయిదా వేశామని తెలిపారు. డ్రాకు హాజరైన వారందరికీ  కుర్చీలు, త్రాగునీరు, తదితర ఏర్పాట్లు ఎక్సైజ్ శాఖ వారు  చేశారు.

Share This Post