లాటరీ పద్దతిన వైన్‌ షాపుల రిజర్వేషన్‌ కేటాయింపు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

2021-23 నూతన అబ్బారీ విధానంలో రిటైల్‌ మద్యం దుకాణాల ఎంపికలో ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ పద్దతిన వైన్‌షాపుల రిజర్వేషన్‌ కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైన్‌షాపుల రిజర్వేషన్‌ ఖరారు ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 73 ఏ4 వైన్‌షాపులలో అబ్బారీ శాఖ ఆదేశాల మేరకు గౌడ కులస్తులకు 6 షాపులు, షెడ్యూల్డ్‌ కులాల వారికి 10 షాపులు, షెడ్యూల్డ్‌ తెగల వారికి 6 షాపులు రిజర్వ్‌ చేయడం జరిగిందని, వైన్‌షాపుల రిజర్స్‌ ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకంగా ఉండేందుకు వీడియోగ్రఫీ చేయడం జరిగిందని తెలిపారు. మద్యం షాపులు కేటాయించే సమయములో గౌడ కులస్తులకు 15 శాతం, షెడ్యూల్డ్‌ కులాల వారికి 10 శాతం, షెడ్యూల్డ్‌ తెగల వారికి 5 శాతం రిజర్వేషన్‌ కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎస్‌.టి. నోటిపఫైడ్‌ ప్రాంతాలు ఉన్నందున ఎస్‌. టి.లకు
6 షాపులు రిజర్చ్‌ చేయడం జరిగిందని, షెడ్యూల్డ్‌ కులాలు, గౌడ కులస్తులకు రిజర్వ్‌ చేసిన షాపుల ఎంపిక ప్రక్రియను లాటరీ పద్దతిన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి సమక్షంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తి కాగా మిగిలిన 51 షావులకు అన్ని వర్షాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని, డిసెంబర్‌ 1, 2021 నుండి నవంబర్‌ 30, 2023 వరకు ప్రస్తుతం కేటాయించే షాపుల లైసెన్స్‌ ఉంటుందని, షాపు కేటాయింపు ప్రక్రియ నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాల కార్యచరణ అబ్బారీ శాఖ ఆధ్వర్యంలో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అబ్మారీ శాఖ అధికారి నరేందర్‌, సహాయ కమీషనర్‌ జి. శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్‌
కులాల అభివృద్ధి అధికారి పి.రవీందర్‌రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఖాజా నజీమ్‌ అలీఅప్సర్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post