లాటరీ పద్దతి ద్వారా మద్యం షాపులు కేటాయింపు. 99 మద్యం షాపులు భర్తీ.:::: జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

2021-23 సంవత్సరాల గాను జిల్లాకు కేటాయించిన 99వైన్ షాపుల ఎంపిక కార్యక్రమం శనివారం నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మద్యం షాపుల కేటాయింపు కార్యక్రమం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సమక్షంలో   జరిగింది.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధరఖాస్తుదారులు సమక్షంలో
  లాటరీ పద్ధతి ద్వారా ముందుగా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ షాపులను కేటాయించడం జరిగిందని అలాగే 81 మంది పురుషులు, 18 మంది మహిళలకు మద్యం షాపులు కేటాయింపులు లాటరీ పద్దతిలో కేటాయించడం జరిగిందని అన్నారు.
జిల్లాలో మొత్తం 99 షాపులకు గాను ST సంబంధించి 90,  SC సంబంధించి 326,  Goud సంబంధించి 718 ,  Open కేటగిరిలో 1883 దరఖాస్తులు  రావడం జరిగిందని అన్నారు.
సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో  అన్ని క్యాటగిరి వారీగా సూర్యాపేట 787,
తుంగతుర్తి 373, కోదాడ 888,  హుజూర్ నగర్ 969  వచ్చాయని మొత్తం 3017 దరఖాస్తులు అందాయని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్,  జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్, సి.ఐ లు తిరుపతి రెడ్డి,  బాలాజీ నాయక్, రాజ్యలక్ష్మి, శ్యామ్ సుందర్, శ్రీనివాస్, ఎక్సైజ్  పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లాటరీ పద్దతి ద్వారా మద్యం షాపులు కేటాయింపు.
99 మద్యం షాపులు భర్తీ.
జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

Share This Post