ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ పద్ధతిన బ్రాందీ షాపుల (A4 దుకాణాలు) కేటాయింపు ప్రక్రియను నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బ్రాందీ షాపుల కేటాయింపు లాటరీ పద్ధతిన సంక్షేమ శాఖల అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కమీషనర్, ఎక్సయిజ్ శాఖ వారు 40 దుకాణాలను కేటాయించడం జరిగిందని, వారి ఆదేశాల ప్రకారం జిల్లాలో 25 దుకాణాలు ఓపెన్ కంపిటేషన్, 9 దుకాణాలు షెడ్యూల్డు తెగల వారికీ, 5 దుకాణాలు షెడ్యూల్డు కులాల వారికీ, ఒక దుకాణం గౌడ కులస్తులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొబిషన్, ఎక్సయిజ్ అధికారి ఎస్.రవీందర్ రాజు, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారిణి సునీత, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగం, సహాయ గిరిజన సంక్షేమ అధికారి ప్రణయ్, సిఐ CH.శ్రీనివాస్, ఉట్నూర్ సిఐ మంగమ్మ, ఎస్ఐ K.అరుణ్ కుమార్, కార్యాలయ పర్యవేక్షకులు ఇమాన్యుల్, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB -లాటరీ పద్ధతిన బ్రాందీ షాపుల కేటాయింపు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB -ఆదిలాబాద్ పట్టణం లోని గాంధీ పార్క్ ను సుందరంగా, పచ్చదనంతో, స్వచ్ఛతతో నిర్వహించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
-
DPRO ADB- ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి- అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్.
-
DPRO ADB- ధరణిలో కొత్త మాడ్యూల్ ని సదవినియోగం చేసుకోండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు- జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ.