లాటరీ పద్ధతి ద్వారా వైన్ షాపు రిజర్వేషన్లు కేటాయించిన జిల్లా కలెక్టర్


లాటరీ ద్వారా వైన్ షాపుల రిజర్వేషన్ కేటాయింపు ఖరారు::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి , నవంబర్ 08:- లాటరీ పద్దతి ద్వారా జిల్లాలో వైన్ షాపు రిజర్వేషన్ కేటాయింపు ఖరారు చేసామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో ఉన్న 77 ఏ4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పారదర్శకంగా రిజర్వ్ వైన్ షాపులు కేటాయించే విధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రాఫీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు మధ్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎస్టీ నోటిఫైడ్ ప్రాంతాలు లేనందున ఎస్టీలకు షాపు రిజర్వేషన్లు కేటాయించలేదని, గౌడకులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు కేటాయించామని తెలిపారు. ఎస్సీలకు మరియు గౌడ కులస్థులకు రిజర్వ్ చేసిన షాపుల ఎంపిక ప్రక్రియను లాటరీ ద్వారా 13 సైకిళ్లలో నిర్వహించారు. మొదటి 8 సైకిళ్లలో మొదట తీసిన నెంబర్ ఎస్సీలకు తరువాత తీసిన నెంబర్ గౌడ కులస్థులకు కేటాయిస్తూ, 9వ సైకిళ్ల నుంచి 13వ సైకిళ్ల వరకు మొత్తం గౌడ కులస్థులకు ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలో గౌడ కులస్థులకు షాపు నెం. 8,76,64,9,27,52,21,44,57,55,29,17 లను, ఎస్సీలకు షాపు నెం. 45,24,4,46,67,10,49,25 లను లాటరీ ద్వారా కలెక్టర్ ఎంపిక చేసారు జిల్లాలో మిగిలిన 56 షాపులకు అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 1,2021 నుంచి నవంబర్ 30,2023 వరకు ప్రస్తుతం కేటాయించే షాపుల లైసెన్స్ ఉంటుందని, ప్రతి షాపు కు రూ.2 లక్షల నాన్ – రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. వైన్ షాపు కేటాయింపు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వికరణ మొదలైన అంశాల షెడ్యుల్ ను అబ్కారీ శాఖ కమిషనర్/సంచాలకులు ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు.
జిల్లా అభ్కారీ శాఖ సూపరిండెంట్ జే. రవి కుమార్, బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

Share This Post