లాభదాయక పంటల పై దృష్టి పెట్టాలి. రైతులలో అపోవలు తొలగించాలి. ఆయిల్ ఫామ్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి. వానాకాలం పంట ప్రభుత్వం కొనుగోలు. జిల్లాలో 333 కేంద్రాలు ఏర్పాటు. వచ్చే మూడు సంవత్సరాల్లో 20 వేల ఎకరాలలో పామాయిల్ సాగు. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

జిల్లాలో వానాకాలం పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.  గురువారం స్థానిక బాలాజీ కన్వెన్షన్ హాల్ నందు  జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన యసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలంలో ధాన్యం కొనుగోలు సమీక్షలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతులు పండించిన ప్రతి గింజను ప్ర భుత్వం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. సమగ్ర వ్యవసాయ విధానం పై రైతులకు రైతు వేదికల ద్వారా పంటల సాగు పై అవగాహన కల్పిస్తామని అన్నారు. యస్.సి. ఐ యాసంగి పంట కొనుగోలు చేయదని తెలపడంతో  రైతులు ఇబ్బంది పడకుండా వరికి బదులు లాభదాయక పంటలు పండించు కోవాలని మార్కెట్ లో ధర అధికంగా ఉన్నందున రైతులు పంటలపై దృష్టి పెట్టాలనీ విజ్ఞప్తి చేశారు.  ఈ వానాకాలంలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అయ్యే అవకాశం ఉన్నందున జిల్లాలో 333 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.  అన్ని కేంద్రాలలో 270  ధాన్యం శుభ్రత మిషన్లు కొనుగోలు చేశామని అన్నారు.  ధాన్యం కొనుగోలు  మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్ లో పెడతామని , నాణ్యతగా లేదని ధాన్యంధర  తగ్గిస్తే చర్యలు తప్పవని రైతులకు మద్దతు ధర కల్పించాలని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా అదికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని నిర్లక్ష్యాన్ని సహించ బొనని హెచ్చరించారు. యశంగి పంటలపై రైతులకు వాస్తవ పరిస్థితులు వివరిస్తామని అన్నారు. గత పాలకులవలన రైతులు అనేక ఇబ్బందులూ పడ్డారని , ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 750ఎకరాలలో పామాయిల్ పంట సాగులో ఉందని వచ్చే మూడు సంవత్సరాలలో 20 వేల ఎకరాలలో సాగుకు రైతులను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
   ఈ కార్యక్రమంలో డి.సి.యం.యస్. చైర్మన్ వట్టే యాదయ్య, జెడ్.పి. వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్,  యస్.పి. రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, డి. ఏ. ఓ రామారావు నాయక్, డి.యస్. ఓ విజయలక్ష్మి, ఉద్యాన అధికారి శ్రీధర్, పి.డి. కిరణ్ కుమార్, పోలీస్ అధికారులు, వ్యవసాయ అదికారులు, మిల్లర్స్ తదితరులు పాల్గొన్నారు.

లాభదాయక పంటల పై దృష్టి పెట్టాలి.
రైతులలో అపోవలు తొలగించాలి.
ఆయిల్ ఫామ్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి.
వానాకాలం పంట ప్రభుత్వం కొనుగోలు.
జిల్లాలో 333 కేంద్రాలు ఏర్పాటు.
వచ్చే మూడు సంవత్సరాల్లో 20 వేల ఎకరాలలో పామాయిల్ సాగు.
రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

Share This Post