లాభదాయక పంట సాగు పై రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేయాలి. పంట సాగు విధానం పోస్టర్, పుస్తకం ఆవిష్కరణ:::. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు, యాజమాన్య పద్దతులపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇతర పంటల సాగు విధానం పై వ్యవసాయ శాఖకు సంబందించిన పోస్టర్, పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ అవిష్కరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ యాసంగీలో  ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, పెసర , మినుములు, శనగలు, బొబ్బర్లు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, ధనియాలు, కుసుమాలు, ఆవాలు సాగు పై రైతులకు వివరించాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖఇతర పంటల సాగు విధానంపై  జిల్లాకు పంపిన  10 వేల పోస్టర్స్ ,  49, 700  పుస్తకాలు జిల్లాలోని 82 క్లస్టర్లు, అలాగే అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యoగా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంట సాగు విధానం పై సలహాలు,  సూచనలు అందించాలని నిరంతరం క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలని సూచించారు.  జిల్లాలో రైతులు యాసంగి పంటల సాగుకు సమాయత్తం అవుతున్నందున వ్యవసాయ అధికారులు రైతులకు యసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగు, యాజమాన్య పద్దతులపై క్లస్టర్ల వారీగా రైతు వేదికలలో పంట సాగు విధానం పై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని సూచించారు.
   ఈ కార్యక్రమంలో డి.ఏ. ఓ రామారావు నాయక్, ఏ. డి.ఏ లు జగ్గూ నాయక్, ఏ. ఓ లు రాజగోపాల్, జానీ మియా, సందీప్ ,సునీత, ఉషారాణి, ఆషాకుమారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post