లింగ వివక్ష రహిత సమాజ నిర్మాణంలో భాగమే బతుకమ్మ అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్

పత్రికా ప్రకటన                                                                                                                                              తేదీ 27-09-2022

కరీంనగర్

లింగ వివక్ష రహిత సమాజ నిర్మాణంలో భాగమే బతుకమ్మ

అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్

000000

     లింగ వివక్ష రహిత సమాజ నిర్మాణమే ప్రధాన భావనతో తెలంగాణ సాంస్కృతి వికాసం ముడిపడివుందనీ,  అందులో భాగంగా బతుకమ్మ పండుగ అని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.

     మంగళవారం నగరంలోని జ్యోతిరావు పూలే మైదానంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయం  ప్రతీక బతుకమ్మ అని  అన్నారు.   ట్రాన్స్ జెండర్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని, వారిలో దాగిన ఉన్న సృజనాత్మక వెలికి తీయాలనీ అన్నారు. తద్వారా వారిని ఆర్థిక ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మహిళా శిశు సంక్షేమ శాఖ బతుకమ్మ సంబరాల్లో ట్రాన్స్ జెండర్లను ఆహ్వానించామని చెప్పారు. లింగ వివక్ష సమాజ అభ్యున్నతికి గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు. గర్భంలో ఉండే వారికి లింగ పరీక్షలు చేసి  ఆడపిల్ల వుంటే గర్భవిచ్చితి చేసే సాంప్రదాయం విడనాడాలని, అపుడే బతుకమ్మ దేవతను గౌరవించినట్టు అని చెప్పారు.

     అదనపు కలెక్టర్ జి. వి.శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ మహిళా స్వావలంబన చెందాలనే గొప్ప ఆశయం బతుకమ్మ సంబరాలలో ఉందనీ అన్నారు. బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని  కొనియాడారు. తెలంగాణ మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించేది బతుకమ్మ పండుగ అని అన్నారు. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు స్వేచ్ఛా స్వాతంత్ర్యంతో, ఆత్మగౌరవంతో బతుకాలనే సందేశం బతుకమ్మ ఆటలో ఉందనీ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులంతా మహిళా సంక్షేమ శాఖ సిబ్బందితో, ట్రాన్స్ జెండర్లతో బతుకమ్మ ఆడారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే.సబిత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్  జూవేరియా,సిడిపివోలు కస్తూరి, భాగ్యలక్ష్మి, ఉమారాణి, ఏసీడిపిఓలు సరస్వతి, అరవింద, సఖి అడ్మిన్ లక్ష్మి, కార్పొరేటర్ వాలా రమణారావు, సిడబ్ల్యూసి చైర్మన్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share This Post