లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించిన షీ టీం జిల్లా ఇంచార్జి ఏ ఎస్ ఐ విజయలక్ష్మి

ఈరోజు లిటిల్  ఫ్లవర్ హై స్కూల్ నాగర్ కర్నూల్ లో  షీ టీం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో షీ టీం జిల్లా ఇంచార్జి ఏ ఎస్ ఐ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాల గురించి మరియు జరుగుతున్న వేధింపుల గురించి మరియు చట్టాలపై అవగాహన కల్పించారు మహిళను మరియు విద్యార్థులు  ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని భయపడ వద్దని ఆడపిల్లలకు షీ టీం అండగా  ఉంటుందని భరోసా ఇచ్చారు సమాజంలో జరుగుతున్న మహిళలపై అఘాయిత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేధింపులకు గురి చేస్తే వెంటనే DIAL 100 కు సమాచారం అందించాలని లేదా సి టీం డిస్టిక్ వాట్సాప్ 7901099455 కు తెలపాలన్నారు ఇలా సమాచారం ఇచ్చిన వారి పేరును వారి ఫోన్ నంబర్ను గోప్యంగా ఉంచుతామని తెలిపారు మరియు పోక్సో చట్టము నిర్భయ చట్టం ఇతర చట్టాల పై అవగాహన కల్పించారు మరియు షి టీం ఇన్ ఛార్జ్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై తమ తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మగ పిల్లల పై కూడా దృష్టి  సారించాలని అతని  స్నేహితుల అలవాట్లను మరియు చదువుపై ఉన్న శ్రద్ధను గమనించాలని అన్నారు

సమాజం పెడదోవ లో వెళ్లకుండా ముందుగానే విద్యార్థినీ విద్యార్థులను గమనించి పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యత గురువుల దేనని అన్నారు ఇట్టి ఈ కార్యక్రమంలో  షీ టీం ఇంచార్జ్ వెంకటయ్య గారు సైబర్ క్రైమ్ నెంబర్ పవన్ కుమార్ జ్యోతి గారు మరియు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ గారు  ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Share This Post