పత్రిక ప్రకటన
తేది :17.11.2022
నిర్మల్ జిల్లా శుక్రవారం
లే అవుట్స్ నిర్మాణాలు చేపట్టే వారు DTCP పర్మిషన్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని
లే అవుట్స్ యజమానులను ఆదేశించిన జిల్లాపాలనాధికారి
ముష ర్రఫ్ ఫారుఖీ.
2019 కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం నడుచుకోవాలని, నిబంధనలకనుగుణంగా
జిల్లాలో అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను అరికట్టెందుకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
శుక్రవారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో లే అవుట్స్ ఓనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు..
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ మరియు నిషేధిత భుములలో లే అవుట్ లు చేస్తే సహించేది లేదని, అటువంటివాటిని తక్షణమే తొలగించడం జరుగుతుందని తెలిపారు. లే అవుట్ చేయాలనుకుంటే కేవలం పట్టాభూమి లోనే అన్ని విధాలుగా అనుమతి పొంది ఉండాలని, ముఖ్యంగా డిటిసిపి అనుమతి తప్పనిసరి అని, పాతవి కొత్తవి అన్నింటికీ పర్మిషన్ కొరకు డిటిసిపి లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న వాటికి స్క్రూటిని చేసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం లేకపోతే పర్మిషన్ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. ఒకవేళ ప్లాట్స్ ఇదివరకే అమ్మడం జరిగితే ఎలాంటి నష్టం జరగకుండా నిబంధనలకు అనుగుణంగా రీ డిజైన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి విషయంలో తమకు యజమానులతో ఎటువంటి విబేధాలు లేవని భవిష్యత్తులో ప్లాట్ల కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవిన్యూ డివిజన్ అధికారి స్రవంతి , తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్ లే అవుట్ యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.