లైసెన్సులు పొందకుండా దీపావళి బాణసంచాలు విక్రయించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రెవిన్యూ, పోలీస్, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అధికారులతో దీపావళి బాణసంచాలు విక్రయాలు నిర్వహణకు లైసెన్సులు జారీ, రక్షణ చర్యలు, స్టోరేజి చేయుట, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ తేదీ ఆదివారం లైసెన్సులు మంజూరు కొరకు సంబంధిత ఆర్డీఓలకు ధరఖాస్తులు చేసుకోవాలని సోమవారం నుండి లైసెన్సులు జారీ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సంతోషం మాటున ప్రమాదం పొంచి ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే బాణసంచా విక్రయాల దుకాణాలు ఏర్పాటు చేయాలని, జనావాసాల మధ్య విక్రయాలు నిర్వహిస్తే. దుకాణం సీజ్ చేయడంతో పాటు పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పారు. ప్రతి దుకాణ దారుడు ఇసుక బస్తాలు, నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. బాణసంచాలు ఏర్పాటు ప్రాంతాల్లో మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న ప్రమాదం జరిగినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పారు. బాణసంచాలు స్టోరేజి జనావాసాలకు దూరంగా ఉండాలని చెప్పారు. తహసిల్దార్లు, ఎస్ఐలు మండలస్థాయిలో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. దుకాణాలకు దూరంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని, బారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దుకాణాలు ఏర్పాటుకు నిర్దేశించిన స్థలంలో మాత్రమే ఏర్పాటు చేయాలని, ధిక్కరించి ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్ ఏర్పాట్లును పరిశీలన చేయాలని విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. నిరంతర తనిఖీలు నిర్వహించి ఏర్పాట్లును ఎప్పటికపుడు పరిశీలన చేయాలని, ముందస్తు జాగ్రత్తలు వల్లనే ప్రమాదాలను నివారించగలమని చెప్పారు. ఫైయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటు ఏర్పాలు చేసి పటిష్ట తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా విక్రయాలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవని చెప్పారు. స్టోరేజి పాయింట్లును తనిఖీ చేయాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రమాదాలకు తావు లేకుండా పండుగను సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. బాణసంచాలు కాల్చుట రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిషేదమని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే ప్రజలు పిర్యాదులు చేసేందుకు కంట్రోలు రూములు ఏర్పాటు. చేయాలని చెప్పారు. అగ్నిమాపక అధికారులు దుకాణాలను తనిఖీ చేయాలని, ఏదేని ప్రమాదం వాటిల్లినా తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు, డిఆర్డీ అశోకచక్రవర్తి, అగ్నిమాపక అధికారి క్రాంతికుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, కాలుష్య నియంత్రణ ఈఈ రవిశంకర్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు పట్టణాలు మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీకాంత్, నాగప్రసాద్, అంజన్ కుమార్, కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, అశ్వాపురం, ఇల్లందు మండలాల తహసిల్దారు. రామక్రిష్ణ, క్రిష్ణప్రసాద్, నాగరాజు, స్వామి, సురేష్, క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Share This Post